మది అంతరంగం

మది అంతరంగం

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: భార్గవి కనకపురి

మనస్సు అనేది ఒక అద్దాల మేడ
దానిని మనం ఎంత బాగా చూసుకుంటే అంత ప్రశాంతంగా ఉంటుంది..!
నీ బాధ అయిన సంతోషం అయిన
దానికి సరిగా చెప్పుకుంటే అది అర్థం
చేసుకున్నట్టు ఎవరు అర్థం చేసుకోలేరు.!
పారదర్శంగా నీతో ఒదిగిపోతుంది..!
మనస్సు కి ద్వేషం మోసం అనేది నేర్పిస్తే
ఆ కాసేపు ఆనందం దానికి…
ఆ తరువాత అది బాధ పడినంత బాధ
ఎవరూ పడరేమో..!
నువ్వు ఎంత సున్నితంగా చూస్తావో
అంతే నీకు స్వాంతన ఇస్తుంది..!
మనస్సు కి హృదయం ఉంటుంది..
రెండు ఒకటే అని అన్నా భావం ఒకటి
కానీ అదిపొందే అనుభూతి వేరు కదా.!
మనస్సు ను అద్దాల మేడగదిలో ఒక్క
రాయి లాంటి  తగిలివిషం కక్కిన అది తట్టుకోలేదు..!!
దానికి హృదయం ఉంటుంది అని
గ్రహించండి.. నీతో కడ వరకూ ప్రయాణం
చేసే అదృశ్యగనితో నీ జీవితం ఆనందమయం..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!