విజేతలు చాటిన సత్యం

విజేతలు చాటిన సత్యం

రచన: చంద్రకళ. దీకొండ

భారతదేశీయుల సంస్కృతిలో
మిళితమైన ఆరోగ్యకరమైన
సంస్కారం నమస్కారం
ఇతరులతో పరిచయానికి శ్రీకారం
నాగరికతకు తార్కాణమైన విదేశీయుల కరచాలన సంస్కృతి
నేడు అయినది అంటురోగాలకు ఆలవాలం…!
మర్యాద తెలియనివారంటూ
ఆధునికత ఎరుగనివారంటూ
తిరస్కారానికి గురైన
ఆరోగ్యకర అలవాట్ల
భారతీయ సంస్కృతే
నేడు ప్రపంచమంతటా మన్ననలందుకుంటోంది…!
తిరస్కారాలకు గురైనా
మనదైన విలువను
మన ఘన సంస్కృతిని
మనం గౌరవించి
కాపాడుకొంటే
పురస్కారాలకు కొదువేమున్నది…!
దివ్యాoగులంటూ…
అబలలంటూ…
హేళనకు,
తిరస్కారానికి గురైనా…
ఆత్మవిశ్వాసంతో నిలిచి
పతకాల పంటతో
మాతృదేశ పరువు నిలిపి…
పురస్కారాలందుకున్న
విజేతలు చాటే సత్యమిదే…!!!
********************************

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!