స్కూటరు

స్కూటర్

రచన :: వి విజయశ్రీ దుర్గ

నాన్న హలో ఆఫీస్ లో ఉన్నారా అంటు ఫొన్ చేసారు అనిరుధ్ తండ్రి మురళీధరరావు గారికి .ఆ హలో అవును ఆఫిస్ లో ఉన్నాను అంటు చెప్పారు మురళీధరర్ రావు గారు.
ఏమి లేదు నాన్న బస్సు రావడం లేదు నాకు మీ బండి కావాలి ఇస్తారా అంటు అడిగాడు ఆదరాబాదరాగా నాకు రాత్రి ఎనిమిది అవుతుంది నాన్న మరి అని అన్నారు సరే బాబు తీసుకో క్రింద వాచ్ మాన్ దగ్గర చెప్తాను అంటు ఫొన్ పెట్టేసారు మురళీధర్ రావు గారు.
దీర్ఘాఆలోచన లో పడ్డారు మురళిధర్ రావుగారు ఇప్పుడు బండి ఇచ్చేస్తే తనకు ఇంటికి చేరటం నరకమే అనుకున్నారు
లోన్ పెట్టి కొనే పరిస్థితి లేదు వేంటనే తనకు అనుకుంటూ ఆఫిస్ పని లో నిమగ్నమయి పోయారు
సాయంత్రం ఆఫిస్ అయ్యాక ఇంటికి రెండు బస్ లు మారి చేరారు మురళీధర్ రావుగారు
కొడుకు రానే వచ్చాడు నాన్న ఏమి అనుకోవద్దు రెండు నెలలో పరీక్షలు కదా మీ బండి రెండు నెలలు వాడుకొంటాను అన్నాడు. దూకుడుగా తల్లి రుక్మిణి కాఫీ గ్లాస్ తో లోపలి నుంచి వస్తు గట్టిగా అనిరుధ్ ఇది ఏమి పద్ధతి నాన్న మీ నాన్న గారు రెండు బస్ లు మారాలి అయన ఈ వయసులో కష్టపడటం కుదరదు అంటు అంది కోపంగా వేంటనే మురళిధర్ రావు గారు పోనిలే రెండు నెలలు కదా సర్దుకుంటాను అంది మీరు ఉండండి అస్సలు నీవే ఒక గంట ముందు త్వరగా వెళ్లరాదా అంది లేదమ్మా వీలు కాదు
మా రోజుల్లలో మేము నడిచే వెళ్ళేవాళ్ళం తెలుసా అంది తల్లి

అనిరుద్ తప్పని పరిస్థితుల్లో నాన్న ని అడిగాను పార్ట్ టైం జాబ్ కూడా చేరానమ్మ ఏదో ఒక బండి లోన్ పెట్టి కొనుక్కుంటాను అన్నాడు అనిరుద్ తల్లితో
మా ఆఫిస్ లో పరంధామయ్య గారు బండి పై వస్తాను ఈ రెండు నెలలు ఇంటికి
సరేనా వారు మన ఇంటికి ప్రక్క సందులో ఉంటారు అన్నారు అవును కదండీ సరే అన్నారు భార్యా
రెండు నెలలు పూర్తి అయ్యింది తండ్రికి తాళం చెవు అందిస్తూ నాన్న కి అనిరుద్ థాంక్ యు డాడీ అంటు ఇవ్వబోతే వద్దు నాన్న ఈ బండి నీవు ఉంచుకో నేను
పరంధామయ్య గారితో ప్రతి రొజు బండి పై కలసి వెళదాము అని చెప్పాను నీకు మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడ్డాక అలాగే బండి తాళాలు తీసుకొంటాను అని చెప్పారు గద్గద స్వరంతో కొడుకుని వాటేసుకుంటూ
అన్నట్టుగానే క్యాంపస్ సెలక్షన్ లో ఇంటర్వ్యూ సెలెక్టయి మంచి సంస్థలో ఉద్యొగం తెచ్చుకున్నారు అనిరుద్ తొటి
మంచి స్కూటర్ కూడా కొన్నుకున్నాడు.తన సంకల్పం నెరవేర్చుకొన్న సంతొషంతో తండ్రికి ఆనందంగా ఉందంటూ అంటే
మురళీధరరావుగారు కొడుకుని కూర్చోపెట్టి రెండు విషయాలు చెపుతాను.
మీ అమ్మ నీకు జీవితాన్ని ప్రసాదిస్తే తండ్రిగా నేను నీకు రక్షణ కవచం నాన్న క్రమశిక్షణ సమయస్ఫూర్తి తొటి ఉద్యొగం చేసి మంచి పేరు గడించు బాబు
నలుగురికి మంచి చేస్తూ అందరికి కావాలి నీవు ఆదర్శప్రాయం అంటు సున్నితంగా చెప్పారు తండ్రి మురళిధర్ రావు గారు .

శుభం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!