ఎవరికోసం నేను

(అంశం:”అంతరంగం ప్రశ్నిస్తే”)

ఎవరికోసం నేను

రచన: శైలజ శశి ఇందుర్తి

నా మనసులో తెలియని
, ఏదో ‌సంఘర్షణ
ఏదో ‌అలజడి
ఏదో బాధ
మౌనం వీడి
మనసుకుదుట పడాలని
ఆరాటపడే వేళ, నన్ను
ప్రశ్నించే అంతరంగం
ఎవరికోసం నీవు
నేను నేను అనుకున్నావు
నా వాళ్ళ కోసం అన్నావు
వారు అంతా ఏరి,
ఏది నీది కాని ఈ సమాజంలో
నీకోసం ఎవరు
నువ్వు కడుపు కట్టుకొని తిని,తినక
కూడబెట్టుకున్నది నీ కోసం నీ కాసుల పెట్టె దాటి రాలేదే,
బంగారు వర్ణంలో మెరిసి పోతూ
అందంగా ‌ఉన్నానని మురిసిపోతూ
ఎన్నో మెరుపులు అద్దిన నీ శరీరం
నీకోసం రాలేదే,
నువ్వు ఆడిన ఆట,పాడిన పాట , మాట్లాడిన మాట అన్ని నీ వాళ్ళకి జ్ఞాపకమై
ఇక్కడే ఉంటాం అని నీకోసం రాలేదే
ఇలా నా అంతరంగం ప్రశ్నలు
సంధించే
మళ్ళీ తానే
సమాధానమై

నీది అన్నది నీది కాదని
నీకు తెలియదు
నీ కోసం మిగిలినవి నువ్వు చేసిన మంచి
నీ మానవత్వం
మంచి, మానవత్వం నీ జీవితంలో
నీవు ఉన్నా లేకున్నా అవే నీకు తోడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!