చల్లని నీడ
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: సుజాత కోకిల
ట్రైన్ ఆగడంతో ఉలికిపాటుగా లేచింది. అమ్మ! మనం దిగవలసిన ఊరు వచ్చేసింది అనడంతో, ఇద్దరు ట్రైన్ దిగారు. పూజా సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగింది. రామచంద్రయ్య గారు, తను పుట్టగానే తల్లి మరణించడంతో అన్నీ తానే అయి పెంచాడు. ఎంతమంది పెళ్లిచేసుకోమన్న నాకు భార్యగా వస్తుంది, కానీ నా బిడ్డకు తల్లిగా రాదని పెళ్లి చేసుకోకుండా అలాగే ఉన్నాడు. తండ్రి ఏ కష్టం తెలియకుండా అల్లారుముద్దుగా పెంచాడు. తండ్రి పోవడంతో తనకు ఆధారం లేకుండా పోయింది.
తనకు ఊహ తెలిసినప్పటి నుండి అన్నీ రామయ్యనే చూసుకునేవాడు. పూజ అమ్మంటే రామయ్యకు వల్లమాలిన ప్రేమ, తండ్రికి నమ్మినబంటు. రామయ్య చేతుల్లోనే పెరగడంతో తండ్రి రామయ్య చేతిలో పెట్టి మరణించాడు. గొప్ప ఇంట్లో పుట్టి పెరిగిన బిడ్డ నా ఇంట్లో ఎలా బ్రతుకుతుంది. గంజినీళ్లు తిని బ్రతికేవాళ్ళం అంటూ బాధపడేవాడు రామచంద్రయ్యగారు ఫ్రెండ్ శేషయ్యగారు మంచి స్నేహితులు మధ్య మధ్యలో వచ్చి యోగక్షేమాలు తెలుసుకొని వెళ్లేవాడు. తన సంరక్షణలో వుంటే బాగుంటుందనే ఆలోచన రావడంతో పూజమ్మ నాన్న ఫ్రెండ్ శేషయ్య గారింట్లో దిగపెడతాను అన్నాడు, సరే రామయ్య అంది. చాలా మంచివాడు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అనడంతో శేషయ్యగారి ఇంటికి వస్తానని ఒప్పుకుంది. నేను అప్పుడప్పుడూ చూసి వెళ్తుంటాను తల్లి అన్నాడు బాధగా అలాగే రామయ్య నీ ఇష్టం అంది. వెంటనే ప్రయాణం అయ్యారు. ఇంత పెద్ద మహాపట్నంలో ఇల్లు దొరకడం చాలా కష్టమే కానీ తను అయ్యగారితో వెళ్తుండేవాడు కాబట్టి ఇంటి అడ్రస్ ఉండటంతో తొందరగానే దొరికింది. పూజమ్మ ఇదే ఇల్లు అనడంతో ఈ లోకంలోకి వచ్చింది.
ఇంటి ముందు పిల్లలు ఆడుతున్నారు. బాబు ఇలా రా నాయనా అని పిలిచాడు, ఏంటి చెప్పండి అన్నాడు బాబు. శేషయ్యగారు ఇల్లు ఇదేనా బాబూ అని అడిగాడు. అవును, ఇదే ఆయనే మా నాన్నగారు అని చెప్పాడు. అవునా బాబూ ఒకసారి పిలుస్తావా నాన్నగార్ని ఆ పిలుస్తానుండండి. నాన్న గారు మీకోసం ఎవరో వచ్చారు చూడండి అంటూ పరుగెత్తుకుంటూ చెప్పి వెళ్లాడు. రామయ్యను చూడగానే సంతోషంగా నువ్వు ఇలా వచ్చావేంటి రామయ్యా అయ్యగారు బావున్నారా! అని అడిగారు. ఇంక ఎక్కడి అయ్యగారు, బాబు ఈ లోకం విడిచి పెట్టిపోయారు. ఇంకా మనకు లేరు అంటూ ఏడ్చాడు. అయ్యో అలాన నాకు చెప్పలేదు. రామయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. పూజమ్మ ఆస్తికోసం బంధువులంతా కాపు కాచుకుని కూర్చున్నారు. పూజ అమ్మను ఏం చేస్తారోనని పూజ అమ్మగార్ని తీసుకు వచ్చానండి ఇక్కడే ఉంటుంది ఎలాగైనా మీరే చూసుకోవాలని చెప్పాడు. అలాగే ఎంతమాట ఇక్కడే ఉండని తనకేం పర్వాలేదు. రామ్మ పూజా అంటూ పిలిచాడు. నమస్కారమండీ అంది ఏమ్మా పూజా బావున్నావా అంటూ నువ్వేం బాధపడకు తలపై చేయి వేసి ధైర్యం చెప్పాడు. ఈ మాటలు విన్న కాంతం ఏమయ్యా ఇలా వస్తావ అంటూ పిలిచింది. ఆ వస్తున్నానెే ఏంటో చెప్పవే గంపెడు పిల్లలతో చాకిరీ చెయ్యలేక చస్తుంటే ఇంకా ఈ దరిద్రాన్ని కూడా నా నెత్తిపై పెడితే నేనేం చేస్తాను. ఇది ధర్మసత్రం అనుకుంటున్నావా అంది కోపంగా అది కాదు కాంతం నీవు ఒక్కదానివే చేసుకోలేకపోతున్నాను అంటున్నావ్ కదా నీకు ఆసరాగా ఉంటుంది. ఉండని అన్నాడు. అలాగైతే సరే ఉండని ఓ మూల పడి ఉంటుంది అంది.
అప్పుడే చిట్టిబాబు వచ్చాడు అక్క బావున్నావా అంటూ పలకరించాడు. బావున్నాను అంది నవ్వుతూ అప్పుడప్పుడు నాన్నతో వెళ్లేవాడు అక్క అంటే ప్రేమ అందర్నీ చక్కగా పలకరిస్తుంది. అమ్మాయి పేరేంటన్నావు అంది కాంతం నాపేరు పూజా అంది వెళ్లు వెళ్లి అందరికీ కాఫీ పట్టుకురా అంది చిట్టిబాబు వంటగది చూపించాడు. అందరికీ చక్కగా కాఫీ పెట్టుకుని వచ్చింది. కాఫీ బావుందని అందరూ మెచ్చుకున్నారు రామయ్య పూజ అమ్మకు చెప్పి వెళ్ళిపోయాడు. అందరితో చక్కగా కలిసిపోయింది. అందరికీ ఏ పని కావాలన్నా క్షణాల్లో చేసి పెడుతుంది. కాంతమ్మను కూడా ఏ పనిచెయ్యనీయకుండా చూసుకుంటుంది. పిల్లలతో కూడా కలిసి ఉంటూ అందర్నీ తనే తయారు చేస్తుంది. అక్కా అక్కా అంటూ అందరూ కలిసిపోయారు. కాంతం తమ్ముడెే అదోలా ఉంటాడు అతని చేష్టలు తనకు నచ్చేవి కావు, ఎప్పుడూ ఒంటరిగా దొరుకుతుంద అన్నట్టుగా కాపు కాస్తుండేవాడు. ఏవో పిచ్చి మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవాడు. తగిన సమాధానం చెప్తూ తప్పించుకుని తిరిగేది ఇలా ఎంతకాలం పడటం తనలో తానే బాధపడింది ఇబ్బంది పెడుతుండగా ఒకరోజు చిట్టిబాబు చూశాడు. ఏంటి మామ ఈరోజు ఇంట్లోనే ఉన్నావ్ ఏంటి సంగతి పోలీసులు కానీ నీ కోసం వెతుకుతున్నారా, ఏంటి మామ అన్నాడు. అదేం లేదురా అన్నాడు పద అంటూ అక్కడి నుండి తీసుకెళ్లాడు. చిట్టిబాబుకు సినిమాలంటే పిచ్చి యాక్టర్ కావాలనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటాడు. శేషయ్యగారి చిన్ననాటి స్నేహితుడు కలుస్తాడు. ఒకర్నొకరు యోగక్షేమాలు తెలుసుకుంటాడు. ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాడు అక్కడ పూజను చూస్తాడు ఎవరీ అమ్మాయని అడుగుతాడు. రామచంద్రయ్య గారి కూతురని చెప్తాడు. తన చిన్ననాటి స్నేహితుడి కూతురేనని చాలా బాధపడతాడు. బావున్నావా తల్లి అంటూ ఇద్దరు పలకరిస్తారు. మీ నాన్నగారు నాకు చిన్నప్పటి మంచి స్నేహితుడని చెప్తాడు. చాలా ఘోరం జరిగింది తల్లి అంటారు శేషయ్యగారికి ఆరుగురు పిల్లలు పెద్ద కూతురు గీత కొడుకు చిట్టిబాబు. సినిమాలో చేరాలని యాక్టర్ అవ్వాలని కోరిక” సరదాగా కాలక్షేపం చెసి భోజనాలయ్యాక వెళతారు. చంద్రశేఖర్ కొడుక్కి శేషయ్యగారి బిడ్డను ఇవ్వాలని కాంతం చెప్తుంది అదేమాట ప్రస్తావిస్తారు మాదేం లేదని అబ్బాయి ఇష్టమని చెప్పారు. ఒకరోజు రాత్రి తను ప్రేమించిన హరి వస్తాడు. ఎందుకు వచ్చావని అడుగుతుంది ఈ ఇంటికి కాబోయే అల్లుడివి నాతో ఇలా చూస్తే ఏమైనా అనుకుంటారు వెళ్లిపోండి అని చెప్తుంది. ఇద్దరి మధ్య అపార్థాలు ఏర్పడతాయి. హరి ఎంత చెప్పినా వినదు హరి ఢిల్లీకి వెళ్లిపోతాడు. పూజ గర్భవతి అవుతుంది. కాంతం ఇంట్లోంచి తన్ని తరిమేస్తుంది. శేఖర్ వాళ్ల ఇంటికి వెళ్తుంది. పూజ ఇలా ఇంత రాత్రివేళ వచ్చావేంటి అడుగుతారు. ఎంత అడిగినా సమాధానం చెప్పదు మౌనంగా ఉంటుంది. అత్తయ్యా అంటూ బావురుమని ఏడుస్తూ తన జరిగిన విషయమంతా సరళ అత్తయ్యకు చెప్తుంది. అదే విషయం తన భర్తతో చెప్తుంది. ఇంత మంచి అమ్మాయి ఇలా జరిగిందేంటి అని బాధపడుతూ తన ఇంట్లోనే ఉంచుకుంటారు. ఒక బిడ్డకు జన్మనిస్తుంది. కొన్ని రోజులకు ఢిల్లీకి నుండి వస్తాడు. ఇంట్లో బొమ్మలని చూసి ఎవరివని అడుగుతాడు. అక్క పిల్లలవ నని అడుగుతాడు. కాదు పూజ కొడుకవని చెప్తుంది. ఇప్పుడు పూజ ఎక్కడుందమ్మా అని అడుగుతాడు బాబును మనకు ఇచ్చేసి అందనంత దూరానికి వెళ్లిపోయిందని చెప్తుంది. అమ్మా నేను చాలా తప్పు చేసానని ఏడుస్తూ తల్లిదండ్రులకు వివరంగా చెప్తాను. ఎంత పనిచేశావు దుర్మార్గుడా ఇంత మంచి అమ్మాయిని మోసం చేస్తున్నావానని తండ్రి అరుస్తాడు. ఇప్పుడు బాబు ఎక్కడున్నాడని తెలుసుకుంటాడు. మన పోస్టుమాన్ దగ్గర ఉన్నాడని చెప్తాడు. హరి పరిగెత్తుకుంటూ వెళ్లి బాబును చూస్తాడు. ఏడుస్తూ సంతోషంగా బాబును అక్కున చేర్చుకుంటాడు. అంతలో బాబూ అంటూ పూజ అక్కడికి వస్తుంది. పూజని చూడగానే ఆశ్చర్యపోతాడు. తన తప్పు తెలుసుకొని పూజను అక్కున చేర్చుకొని సంతోషంగా ఉంటారు.