వేదన
రచయిత :: వి. కృష్ణవేణి
గెలవాలనే తపన
మోయలేని బాధ్యత
అణుకువగా ఉంటే అలుసా
ఆరా తీస్తే ఆరోపణా
కనికరం లేని కల్మషం
గుర్తొచ్చే ఆశయం
గుర్తించని లోకం
ఆలోచన మించిన ఆవేద
అడ్డుగోడల ఆదరణ
మనసులోని వేదన
మరపురాని శోదనా
సాధించాలనే ఆరాటం
అందని ఆర్భాటం
మరలరాని కాలం
మారని తలరాత
మగువకు ఇది పోరాటం
మరుజన్మ కైన తీరునా
ఈ రోధన!