పల్లే నా ఊపిరి

పల్లే నా ఊపిరి

       నానా జానూ.., పింకీ..,మనమూ అమ్మమ్మ వాల్ల ఊరు వెలుతున్నామోచ్!! అంది నవ్వుతూ తల్లి రేఖ.ఆ మాట వినగానే ఇద్దరు పిల్లలు పరుగు పరుగున వచ్చి  సంతోషంతో అమ్మను వాటేసుకున్నారు. ఎప్పుడూ?? అంది జాను, ఇప్పడే కాని ఇంకా టైమ్ ఉందని చెప్పింది అమ్మ. ఇప్పుడే వెలుదాం అంటూ పింకీ గోముగా అంది. సరేసరే అల్లరి చేయొద్దు మరి..! సరే అమ్మ!! అన్నారు. ఏమండీ!! నేనూ,పిల్లలు మా అమ్మ వాల్లింటికి వెలుతున్నామండి అంది, తను కళ్లతోనే ఎందుకు అన్నట్టుగా చుసారు, నాన్నగార్కి ఒంట్లో బాగులేదటండి నన్ను చుడాలని ఉందని చెప్పారట,అమ్మ ఫోన్ చేసి చెప్పింది. వినివినట్టుగా కొద్దిగా చిరాకు పడ్డారు. పింకీ, జానూ గొడవ చేయడంతో సరే అని ఒప్పుకున్నారు.

పింకీ, జానుల సంతోషం ఇంత అంతా కాదు బట్టలు సర్థుకుని ,అమ్మా మేము రడి!!అన్నారు. అమ్మా!!

రేఖమ్మ !! మీ అమ్మగారు మిమ్మల్ని తోలుకు రమన్నారు తల్లీ …అంటూ అమ్మవాల్ల పాలేరు వెంకన్న వచ్చాడు.ఏం వేంకన్నా బాగున్నావా? ఏదో మీ దయ తల్లీ బానే ఉన్నానమ్మ!. అమ్మమ్మ ఇంటికి వెలుతున్నాము అన్న దగ్గర నుండి పిల్లలు గొడవ వెంకన్నా!!  ఒకటే అల్లరి చెస్తున్నారు. అమ్మ బుజ్జమ్మలూ!!  ఎవరు వచ్చారో చూడండీ…

అంటూ వెంకన్న కేకవేసాడు.ఆ గొంతు వినగానే రయ్యిన పరుగెత్తుకుంటూ వచ్చారు పిల్లలు.

హాయ్!! వెంకన్నతాతా‍‌!! అంటూ మురిసి పోయారు. ఇక వెల్దామా తల్లులు….??  ఓ !!! మేము రడీ!! అంటూ.. వచ్చి ఎడ్లబండీలో ఎక్కి కూర్చున్నారు. పిల్లల ఆనందానికి అవదులు లేవు,దారి పొడవునా ముచ్చట్లే..ఆ ఊరికి ఈ ఊరికి గోదావరి అడ్డు .ఆ గోదావరికి వెళ్లే దారిలో ఇరుపక్కలా కందిచేను, పెసరిచేను, మక్కచేను ..పచ్చగా అందంగా  కనబడుతుండే, కానీ ఇప్పుడు అవన్నీ తీసేసి ఇల్లస్థలాలుగా మార్చారు. గోదావరిలో ఒక వర్షాకాలంలోనే నీళ్లు  ఎక్కువగా ఉంటాయి మిగితా రోజులలో మాములుగానే ఉంటాయి. తాతా !! మేము ఒకసారి గోదావరిలో  దిగుతాము అన్నారు పిల్లలు. ఒద్దమ్మా!! పడిపోతారు అని సర్ది చెప్ప చూసాడు తాత. నువ్వూ, అమ్మ  ఉన్నారుగా మేము ఏమ్ పడిపోము తాత, ప్లీజ్ ప్లీజ్ అని మారాం చేసారు .

ఇగ తప్పక సరేతల్లి మరి దూరంగా వెళ్లకూడదు అన్నాడు. సరేతాత!! అని సంతోషంగా అన్నారు. బండిని ఒకపక్కగా ఆపాడు, ఎంతచక్కగా,కేరింతలు కొడుతూ ఆడుతున్నారు , వాల్ల మోహలు టపాసుల్లా వెలగాయి.

చూసావా అమ్మ !వారి సంతోషం ,అవును. ఇంక చాలు పొద్దు పోతుంది, పిలువు వాల్లని వెంకన్నా.. రండమ్మా, తల్లులు!!అలాగేతాత  అని, బండిపై కుర్చున్నారు. దారి పొడవునా పొలాల గురించి చెట్ల గురించి అడుగుతూ ఉన్నారు,తాత ఓపికగా అడిగిన వాటికి సమాదానం చెపుతునే ఉన్నాడు.

ఎంత పెట్టుబడి కావాలి,ఎలా పండిస్తారు ,మనం ఎంత కష్టపడి పండిస్తే మన చేతికి ఎంత పంట వస్తుందీ, ఎమేమి ఎరువులు కావాలి, ఎలా వాడాలి ,మనం ఎలా పండించాలి అని వాటి గురించి వివరంగా చెప్పుతున్నాడు, ఊ ఊ అంటు శ్రద్దగా వింటున్నారు పిల్లలు. ఎంత వరకు అర్థమైంది అన్నది వాల్లకే తెలియాలి.

పాపం రైతుబిడ్డ కదా!, ఆవేశం, ఆవేదన కళ్లలో కనబడుతోంది.ఎంత కష్టపడితే పొలాలు పచ్చపచ్చగా  ఉంటాయి,ఈ అమాయకమైన  పిల్లలకి ఎమ్ తెలుస్తుంది అనుకున్నాడు మనసులో.ఈ పల్లే ప్రకృతి, పచ్చదనం, అందాలు ,ఆనందాలు ఎవరికీ అర్థంకావు , కష్టపడి అనుభవించే వారికే తెలుస్తుంది. ఈ కాలువలు, చేరువులు, వంతెనలు, వాగులు, కాలుష్యం లేని వాతావరణం, ఎన్ చక్కగా మందులు లేని కూరగాయలు , పండ్లూ పండించుకుంటాం. తిన్నా ఎంతో రుచిగా  ఉంటాయి.ఇప్పుడు అవిఏవి లేవు తొందరగా పండాలని అడ్డమైన మందులు వేసి పండిస్తున్నారు. మేము  ఏ మందులు వాడం, మా తాతల కాలం నుండి మేము తయారు చేసిన ఎరువులనే  వాడుతుంటాం . ఆ నేల తల్లినే నమ్ముకుని బ్రతుకుతున్నాము.పల్లెను విడిచి సిటీలో బ్రతుకుతున్న మనుషులకు ఎమ్ తెలుస్తుంది అని అనుకున్నాడు వెంకన్న.  మన ఇల్లు వచ్చింది ఏమ్ ఆలోచిస్తున్నావు అంది రేఖ .

దానికి నవ్వాడు కాని సమాదానం చెప్పలేదు.  ఎడ్లబండి సౌండ్ వినగానే భవానమ్మ వచ్చి కుశలప్రశ్నలు అడుగుతూ పిల్లలనీ ,తననీ లోనికి

తీసుకువచ్చింది. అమ్మా నాన్న ఎలా ఉన్నారు ?

ఏరీ?, నాన్నగారు పెరేట్లో ఉన్నారు ,అదే కదమ్మ మీ నాన్నగార్కి కాలక్షేపం పాదులను తవ్వుతూ మొక్కలకు నీళ్లు పోస్తూ, రోజూ సగం  అక్కడే ఉంటారమ్మ !! ఎవ్వరు చెప్పినా వినరు. పిల్లలు తాత దగ్గరకు పెరేట్లోకి వెళ్లారు, తాతా!! అంటూ పిలిచారు .పిల్లలని చూసి అమ్మలూ అంటూ, చేతులు జాపారు రమ్మన్నట్టుగా, నవ్వుతూ పరిగేత్తుతు చేరోచేయిపట్టుకొని పదతాత అమ్మవచ్చింది అన్నారు. పదండి తల్లీ అంటూ లోనికి వచ్చారు. రేఖమ్మ!!  ఎలా ఉన్నావుతల్లి ??అని పలకరించారు. నేను బాగానే ఉన్నాను నాన్న .

మీకేంటి ఒంట్లో బాగులేదని  అమ్మ ఫోన్ చేసింది.మీరేమో రెస్ట్ తీసుకోకుండా ఇలా పనిచేస్తు కుర్చున్నారు.నాకేంమైందమ్మా దున్నలా  ఉంటేనూ!!  అమ్మ అలా చెప్పింది ఏంటి మరి?.ఇలా చెపితే అల్లుడుగారు పంపిస్తారని అలా చెప్పానమ్మ. అసలు విషయం చెపుతాను వినమ్మ, మీ అన్నయ్యలు చెరోదిక్కున ఉన్నారు, మీ నాన్నకు వ్యవసాయం అన్నా, ఈ ఊరు అన్నా ప్రాణం . మేము బాగానే ఉన్నాము ఇవన్ని ఒదిలేసి రమ్మంటున్నారు ,మేము ఎలా వెలుతాము? రామని చెపితే వాల్లు వినడంలేదు .రెండు రోజులనుండి ఒకటే గొడవచెస్తున్నారు.

ఎందుకూ వాల్లకి పిచ్చా ,నేను మాట్లాడుతాను ఉండు మీరు  ఎక్కడికి వెళ్లోద్దూ .

అమ్మ!లేగదూడ ఎంత బాగుందో  చూడు అంటు లేగదూడ దగ్గరికి తీసుకుని వెళ్లారు పిల్లలు.

తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్న ఆవు ,దూడను నెమ్మదిగా  నిమురుతుంది . అది సంతోషంతో పొదుగును పట్టుకుని తాగుతుంది.

ఆ సీను ఎంతబాగుందో ..

అమ్మాయ్ రేఖ!! అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు అనగానే వస్తున్నాను అమ్మ అంది, ఫోన్ తీసుకుని హాలో అంది రేఖ,హ ఏంటీ చెప్పు అన్నయ్య!! జరిగిన సంగతీ అంతా చెప్పుకొచ్చాడు .అమ్మనాన్న, వినడంలేదు అన్నాడు. ఏంటిరా వినేది ?మీకు బుద్ది ఉందా?? ఉన్న ఊరుని, ఉన్న ఇంటిని, ఉన్న ఆస్తులను, అన్నీ అమ్ముకుని రమ్మాంటారా!!? మనపై ఎంతమంది ఆధారపడి బ్రతుకుతున్నారో తెలుసా ??  మీరు చెప్పేది ఎమైనా బాగుందా? చెప్పండిరా… పుట్టిన ఊరును ,నమ్ముకున్న నేలతల్లిని విడిచి ఎలా వస్తారు?  అమ్మనాన్న,మనం బ్రతికింది వీటిపైనే , మనం ఇలా ఉన్నామంటే, ఈ ఊరి ప్రజలే కారణం. అది గుర్తుంచుకోండి మీరు రాకున్నా పర్వాలేదు కాని అమ్మనాన్నలను రమ్మని బాధపెట్టకండి. మీకు చూడాలని ఉన్నప్పుడు మాత్రమే రండి వీల్లని ఊరే చుసుకుంటుంది. మీరేమీ బాధపడకండి.

మద్యమద్యలో ఫోన్ చెస్తు ఉండండి . నేను కూడ ఉన్నాను అన్నీ నేను చుసుకుంటాను. మీరుకూడ బాగుంటేనే అమ్మనాన్నలు కూడ బాగుంటారు . ఇంకోసారి ఈ టాపిక్ తీసుకురావద్దు. సరే చెల్లీ!! నీవు చెప్పాక నీ మాటకు తీరుగేముంటుంది.సరే ఉంటాను అమ్మ… అంటూ ఫోన్ పెట్టేసాడు.

మీరు ఎక్కడికి వెళ్లేది లేదు మీరుహాయిగ ప్రశాంతంగా ఉండండి అమ్మా అంది రేఖ.

నాలుగు రోజులు ఉండి సరదాగా గడిపి చీరసారెలతో ,తిరుగు ప్రయాణం ఆయింది.

పల్లెను విడిచి వెళ్లలేదనే ఆనందం మిగిలింది తల్లితండ్రులకు. అందరూ వాల్ల నీడలో సేదతీరుతు ఆనందంగా బ్రతుకుతున్నారు. ఆ పల్లే ఆయన ఊపిరి.

రచయిత :: సుజాత.కోకిల

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!