సద్విమర్శ

(అంశం :: “విమర్శించుట తగునా”)

సద్విమర్శ

రచన::సావిత్రి కోవూరు

గుణ దోష స్వరూప స్వభావ, నిశిత పరిశీలనతో తరతమ భేదాలు లేక తెగుడుట, పొగడుట
నిష్పక్షపాతమైనదే సద్విమర్శ.
సద్విమర్శలు పురోగతికి దారియై ప్రతిభను వెలికితీయు,
స్వీకరించు ఎప్పుడు సహృదయంతో మన పురోగతికి దారిగా నెంచు.

తేలికౌను పరుల విమర్శించట,
ఆత్మ విమర్శ చేసుకుని,విమర్శించు ఇతరుల,
విమర్శలవసరమే అన్యాయం జరిగినప్పుడు, అహంకారం నిండినప్పుడు, మాటపై నిలబడని
వారెదురైనయపుడు.

పరిశీలన లేని వ్యక్తిగత కక్షతో, పక్షపాతంతో
విమర్శ చేసిన సద్విమర్శ కానేరదు,
ప్రతిభ అణగదొక్కుటకు, ఆత్మన్యూనతను కలిగించుటకు, ఆత్మాభిమానం దెబ్బ తీయుటకు చేయు విమర్శ సద్విమర్శ కానేరదు.

ఎన్ని మంచి కార్యాలు చేసిన, ప్రతి పనికి దోషములెంచి,విమర్శ చేసిన అది కువిమర్శ అగును.
దానివలన కుంటుబడును ఇతరుల ప్రతిభ
కార్యమేదొనరించిన తప్పని సరౌను విమర్శ
ఒరుల మనముల భావజాలములకై ఒనరించిన విమర్శ కువిమర్శ అగున్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!