సద్విమర్శకు స్వాగతం

(అంశం :: “విమర్శించుట తగునా”)

సద్విమర్శకు స్వాగతం

రచన::లోడె రాములు

ఎంత మంచి ఎద్దు కైనా..
ఎంత మంచి మనిషి కైనా…
ఏ వాహనాని కైనా..
నాయకుని కైనా..
కళ్లెం,సద్విమర్శా, బ్రేకుల్లాంటివి..
ఇవి అవసరమే..కదా….!
ఉహించండి బ్రేకుల్లేకుండా…! నడుస్తున్న వాహనం…!
ఎంత గొప్ప వారి కైనా ఆవగింజంత
వెర్రి ఉంటుంది..ఇది సహజం..
మనం కోతి నుండి వచ్చాం కదా..
జాతి లక్షణాలను మరవడం భావ్యం కాదు..
అంత సులభమూ కాదు…
అందుకే..
అనాదిగా మంచిని మంచి మార్గంలోనే చెబుతూ..
కొన్ని సంప్రదాయాల పేర,
ఆచారాల పేర,
కట్టుబాట్లు,పాపాలు..పుణ్యాలు..
ఇలా…ఎన్నెన్నో రకాలుగా..
బ్రేకులు వేస్తూనే ఉన్నారు..
ఇక మనం చట్టాలు..న్యాయాలు.. శిక్షలు..
కానీ…
అన్నిటినీ… అందరినీ ఒకే విధంగా చూడడం సమంజసం కాదు..
అందరికీ భావ స్వేచ్ఛ ఉంది కదా…
అని…అనవసరంగా విమర్శించి..
తాను గురివింద గింజ కానట్లూ…
ప్రవర్తించే అల్ప జీవులు నేడు అడుగడుగునా అన్ని రంగాల్లో ఉన్నారు..
అలాంటి వారికి తగిన గుణపాఠాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉందాం
అయినా…
ఇంగిత జ్ఞానం ఉన్న వారెవ్వరైనా…
వ్యక్తిగత విమర్శ ఏ స్థాయిలోనూ
తగదు…
ఒకరి ఉన్నతిని కోరుకునే
వారెప్పుడూ..
సద్విమర్శ మాత్రమే చేస్తాడు..
ఎవ్వరమైనా సద్విమర్శకు చిరునవ్వుతో స్వాగతం పలుకుదాం.
అది మనల్ని తీర్చి దిద్దే గురువు..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!