విమర్శలో మరోకోణం

(అంశం :: “విమర్శించుట తగునా”)

విమర్శలో మరోకోణం

రచన::వడ్డాది రవికాంత్ శర్మ

పాపపంకిలమైన రాజకీయ బురదగుంటలో ..
స్వచ్ఛమైన కలువలా….
నిశ్చలమైన వ్యక్తిత్వంతో ….
జాతీయవాద దృక్పధంతో …
అవినీతికి ఆమడదూరంలో …
హస్తినలో హడలెత్తిస్తున్న …
అరుదైన నేతపై విమర్శ తగునా ….

వైభవాన్విత చరితకు చిహ్నంగా ..
ఆపదసమయంలో సంజీవనిలా ….
ప్రాణాలను నిలబెడుతూ …
జీవకళను జాతిలో నింపుతున్న ..
దేశీయ వైద్యంపై విమర్శ తగునా ….

అన్నీ వదులుకుని …
అనునిత్యం ..
ప్రతి శ్వాసా….
భరతమాత రక్షణలో ధారపోస్తున్న …
సైన్యం శ్రద్ధపై విమర్శ తగునా …..

తరం తరం నిరంతరంగా …
విజ్ఞానపు వెలుగులను నింపుతూ ..
అజ్ఞానపు చీకట్లను తరిమికొడుతున్న ..
శాస్త్ర వేత్తల వ్యక్తిత్వంపై విమర్శ తగునా ….

దేశద్రోహుల పంచన చేరి ….
జాతి భద్రతని గాలికొదిలి …
భావస్వేచ్ఛ పేరుతో విచ్చలవిడి వ్యాఖ్యలు చేస్తూ …
న్యాయస్థానాన్ని …
న్యాయమూర్తిని ప్రశ్నిస్తూ రాసే …
విమర్శనాత్మక వ్యాసాలు మనకి అవసరమా ?

విమర్శ అభివృధ్ధికోసం ..
విమర్శ జాతి నిర్మాణం కోసం ..
విమర్శ సాహిత్య వికాసం కోసం ..
విమర్శ వ్యక్తిత్వ శిల్పం కోసం ….

కారాదు విమర్శ విధ్యంసక కారకం ..
కారాదు విమర్శ విచ్చిన్నకారకం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!