నన్ను ప్రేమించిన వ్యక్తి

నన్ను ప్రేమించిన వ్యక్తి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : మాధవి కాళ్ల

అమ్మ నేను స్కూల్ కి వెళుతున్నాను అని చెప్పింది ప్రియ. సరే జాగ్రత అని చెప్పింది కమల. కమల కూడ తన పనికి వెళ్ళిపోతుంది తను ఇంటి పని చేస్తుంది. కొన్ని రోజుల క్రితం కమల భర్త తాగుడికి బానిస అయి చనిపోయాడు. కమలకి ప్రియ ఒక్కతే కూతురు. తన భర్తకి కూతురు పుట్టడం ఇష్టం లేదు ఒక రోజు కమలని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళి లింగ నిర్ధారణ చేస్తుంటే రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు దొరికిపోయాడు. కొన్నాళ్లు జైలులో ఉండి వచ్చాడు అప్పడికే కమలకి డెలివరి అయిపోయింది. మహాలక్ష్మి అలాంటి ఆడపిల్లకి జన్మ ఇచ్చింది. కూతురిని బాగా చదివించాలని కమల కోరిక. ఎంత కష్టమైనా ఫర్వాలేదు అనుకొని కూతురిని చదివిస్తుంది. ప్రియ వాళ్ళ అమ్మ కోరిక కోసం రాత్రి, పగలు అని తేడా లేకుండా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకునేది. ఒక రోజు ప్రియ ఇంటర్వ్యూ కి వెళుతుంటే దారిలో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది. అందరూ చూస్తున్నారు తప్ప ఎవరు ఆ వ్యక్తిని హాస్పిటల్ కి తీసుకొని వెళదాం అనే జ్ఞానం కూడా లేదు అని అనుకొని అతని హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళింది ప్రియ. అతని హాస్పిటల్ లో జాయిన్ చేయించి తను ఇంటర్వ్యూ కి వెళ్ళిపోతుంది. ఇంటర్వ్యూ టైం అయిపోవడం వల్ల ప్రియని లోపలికి పంపించడం లేదు అప్పుడే చంద్ర శేఖర్ వచ్చి ఏంటి ఇక్కడ ఏవో మాటలు వినిపించాయి అని అడిగాడు శ్వేతని. అది సార్ ఇంటర్వ్యూ టైం అయిపోయింది అని చెప్తుంటే ఆ అమ్మాయి వినిపించుకోవడం లేదు సార్ అని చెప్పింది శ్వేత. సారీ అండి ఇంటర్వ్యూ టైం అయిపోయింది వెళ్లిపోండి అని చంద్రశేఖర్ చెప్పారు. సర్ నాకు ఉద్యోగం చాలా అవసరం సర్ ప్లీజ్ సర్ అని బ్రతిమాలింది ప్రియా. చెప్పాను కదా అండి సారీ అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు చంద్రశేఖర్. బాధపడుతూ ప్రియా ఇంటికి వెళ్ళిపోయింది. తనికి ఉద్యోగం రాలేదని వాళ్ళ అమ్మకి చెప్పింది  దారిలో జరిగిన యాక్సిడెంట్ గురించి కూడా చెప్పింది కమల చాలా సంతోషించి చాలా మంచి పని చేశావు ప్రియ అని మెచ్చుకుంది. ఈ ఉద్యోగం కాకపోతే వేరే ఉద్యోగం వస్తుంది అని ధైర్యం చెప్పింది ప్రియకి. చంద్రశేఖర్ ఆఫీస్ నుంచి డైరెక్టర్ గా హాస్పిటల్కి వెళ్ళాడు. అర్జున్ ఎలా ఉంది ఇప్పుడు నీకు ఎన్నిసార్లు చెప్పాను కారు స్పీడ్ గా డ్రైవ్ చేయొద్దు అని చెప్పిన వినిపించుకోవడం లేదు ఇప్పుడు చూడు యాక్సిడెంట్ అయింది కొంచెం కోపంగా అన్నాడు చంద్రశేఖర్. సరే అన్నయ్య ఇక నుంచి నేను జాగ్రత్తగానే ఉంటాను ఇంతకీ నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు అని అడిగాడు అర్జున్. నాకు తెలియదు నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పాడు చంద్రశేఖర్. ఆ రూంకి వచ్చిన నర్స్ ని అడిగాడు అర్జున్. సిస్టర్ నన్ను హాస్పిటల్ ఎవరు జాయిన్ చేశారు అడిగాడు. మిమ్మల్ని ఒక అమ్మాయి రోడ్డు మీద చూసి హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పింది నర్స్. ఆ అమ్మాయి పేరు, వివరాలు ఏమైనా మీకు తెలుసా అని అడిగాడు అర్జున్. తెలీదు అండి రిసెప్షన్ దగ్గరికి వెళ్లి అడగండి అని చెప్పింది నర్స్. సరే అని చంద్రశేఖర్ వెళ్లి కనుక్కున్నాడు. అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ జాయిన్ చేసిన అమ్మాయి పేరు ప్రియా అని చెప్పాడు. ప్రియా ఫోన్ నెంబర్ తెలుసుకొని  థ్యాంక్స్ అని చెప్పాలని అనుకున్నాడు అర్జున్ కానీ ప్రియ నంబర్ దొరకలేదు. ఒక రోజు అనుకోకుండా ఆఫీస్ కి నర్స్ వస్తుంది. అక్కడ ప్రియని చూసి చంద్రశేఖర్ కి చెప్పింది అక్కడ ప్రియని చూసి ఆ రోజు నేను తప్పు చేశాను అని తన మనసులో అనుకుంటాడు. ఈ విషయం అర్జున్ కి చెప్పి ఆ అమ్మాయి ఫోటో చూపించాడు. తనని హాస్పిటల్ లో జాయిన్ చేసిన ఆ అమ్మాయి మానవత్వం చాలా బాగా నచ్చి తన ఫోటో చూసి ఇష్టం కాస్త ప్రేమగా మారింది అర్జున్ కి. ప్రియకి తెలియకుండా తన ఆఫీసుల్లోనే జాబ్ చేసుకుంటూ తనని రహస్యంగా ప్రేమిస్తున్నాడు అర్జున్. ప్రియకి అప్పుడప్పుడు లెటర్స్ రాసి తనని ఇంప్రెస్ చేయాలని అనుకున్నాడు. కొన్ని రోజులు తర్వాత కమల ప్రియకి సంబంధాలు చూసింది. ఈ విషయం తెలిసి అర్జున్ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పాడు. అందరూ ప్రియని చూసి ఒప్పుకున్నారు. ఒక వారం తరువాత ప్రియ ఇంటికి పెళ్ళిచూపులకు వెళ్లి ప్రియ అర్జున్ ని చూసి షాక్ అయింది. తరువాత అర్జున్ తన ప్రేమ గురించి చెప్పాడు. ప్రియ, కమల ఒప్పుకున్నారు. వాళ్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రియాతో పాటే వాళ్ళ అమ్మను కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ప్రియ ఇంకా హ్యాపీ గా ఉంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!