కర్తవ్యం

(అంశం:”బానిససంకెళ్లు”)

కర్తవ్యం

రచన:సావిత్రి కోవూరు

బానిసత్వం బానిసత్వం ఎక్కడ ఉంది బానిసత్వం

అది కులమా? మతమా? బిరుదా? దానిని తొలగించుకోవాలి

ఎవరికి ఎవరు బానిసలు ఏలే వారికి పాలింపబడే వారు బానిసలా

మరి వారే కదా వాళ్లు విసిరే చిల్లరకాశపడి
అమూల్యమైన

తమ ఓటును దుర్వినియోగం చేసుకొని తమ వ్యక్తిత్వాన్ని తాకట్టుపెట్టి

తాత్కాలిక అవసరార్ధం ఐదేళ్లపాటు తమ జీవితాలను బానిసలుగా మార్చుకున్నది.

మనిషిలో చైతన్యం రానంత వరకు, బానిసత్వం కొనసాగుతూనే ఉంటుంది

తమవారికి మేలు చేయుటకు రూల్సన్ని పక్కన పట్టి క్రమశిక్షణ దాటిన క్షణం నుండే మనం పై అధికారులకు బానిసలౌతారు

నీ కర్తవ్యం నీవు నిక్కచ్చిగా, న్యాయంగా, తరతమ భేదాలు చూడక నిర్వర్తిస్తే, ఎవరికి ఎవరు బానిసలు కాలేరు

ఎప్పుడో, ఎవరో, ఎవరికో బానిసలుగా బ్రతికారని
ఎంచి ఇప్పటికీ వారిని బానిసలుగా చూసే నైజం మార్చుకోవాలి

తరాలు మారి ఆ బానిసలే చైతన్యవంతులై యజమానులు అవుతున్నారు, అధికారాలు చేపడుతున్నారు

అప్పుటి యజమానులే ఇప్పుడు బానిసలుగా బ్రతుకులీడుస్తున్నారు

అయినా ఆ ముద్ర పోవడం లేదే, బానిసత్వం అనేది కులం కాదు, మతం కాదు మన తాతలు పుట్టక ముందు నుండి కొనసాగడానికి

మన భావాల నుండి బానిసత్వం అనునది తొలగించుకుంటే అందరం సమానమే, అందరం యజమానులమే

అది తొలగించుకోవడం ఇష్టం లేని వారెందరో.

మనము ఏ ప్రలోభాలకు స్వార్థాలకు లొంగకుండా మన కర్తవ్యనిర్వహణ సక్రమంగా నిర్వర్తించినంత కాలం మనకు మనమే రాజులం, ఎవరికి బానిసలం కాము

ఎక్కడైనా తప్పటడుగు వేసామంటే, జవాబుదారులం  కావలసి వస్తుంది, అక్కడి నుండే బానిసత్వం మొదలవుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!