గురివిందగింజలమా మనం

(అంశం :: “విమర్శించుట తగునా”)

గురివిందగింజలమా మనం

రచన::దోసపాటి వెంకటరామచంద్రరావు

డబ్బుతో కోనేదికాదు
కష్టపడి సంపాదించేదికాదు
సూనాయాసంగా చేసేది
సమయం సందర్భం చూడకుండా చేసేస్తాం
అదేనండి విమర్శించడం
పద్దతుండదు
పరిస్తితులు అలోచించక్కర్లేదు
భయభీతులుండవు
సంకోచించరు
ఎదుటివారిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు
వీరు ఊసరవెల్లిలా రంగులు మారుస్తారు
వీరేనండి గురివిందగింజలలాంటివారు
తమ వెనుకనున్న నలుపును చూడలేరు
ఎదుటివారిలో ఎన్నో తప్పులు వెదుకుతారు
అవసరాలకు ఆత్మీయులమనంటారు
అవసరంతీరాకా వెనుక దెబ్బతీస్తారు
వారు సచ్చీలులు కారు
సహనశీలులంతకన్నాకారు
చేసేవి సద్విమర్శకులసలెకావు
మనిషిని నీర్వీర్యం చేసేస్తారు
విమర్శలు చేయటం తగునా ?చెప్పండి.!

You May Also Like

One thought on “గురివిందగింజలమా మనం

  1. చాలా బాగుంది… రచయిత శ్రీ దోసపాటి వారికి అభినందనలు..👌👏👏👏🙏🏼

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!