సద్విమర్శ-కుద్విమర్శ

(అంశం :: “విమర్శించుట తగునా”)

సద్విమర్శ-కుద్విమర్శ

రచన::మక్కువ. అరుణకుమారి

కప్పి ఉంచేది కవిత్వం
విప్పి చూపేది విమర్శ
కవిహృదయ ఆవిష్కారం కవిత్వం
ఆ హృదయావిష్కార ప్రక్షేపం విమర్శ

ఆశ,నిరాశలతో తారాట్లడుతూ
ఆశయాల సాధనకై అహర్నిశలు శ్రమిస్తున్న వేళ
ఆసరా ఇచ్చేందుకు,ఆలంబన అయ్యేందుకు
ప్రోత్సాహక విమర్శలు అవసరమే!

అందని ద్రాక్షకు అర్రులుచాస్తూ
ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్న వేళ
అవనికి దించేందుకు, ఆ ఆశలు తుంచేందుకు
వాస్తవిక విమర్శలు అవసరమే!

అధికార దర్పంతో,అంధకార లోకంలో విహరిస్తూ,అహంకరిస్తున్న వేళ
ఆ హుంకారాన్ని ధిక్కరించేందుకు
ధీటైన విమర్శలు అవసరమే!

జాడ్యాలు,పైత్యాలు,స్వోత్కర్ష విమర్శలు
ఆధిపత్య భావజాల విమర్శలు
కుతర్కాలు ,కువిమర్శలు
విమర్శకై విమర్శలు
తగవెప్పుడు,వలదెప్పుడు!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!