ఓ ప్రేమా… ఎక్కడ నువ్వు?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: కె. శ్రీలత(హృదయస్పందన)
ఓ ప్రేమా.. ఎక్కడ నువ్వు
ఉదయించే సూర్యునిలో…
చల్లగాలిలో…
పిల్ల తెమ్మెరలో..
కురిసే వర్షంలో..
విరిసే కుసుమంలో..
పండువెన్నెలలో…
పసిపాప నవ్వులో….
అన్నింట్లో ఉన్నానంటావు…
అందరిలో ఉన్నానంటావు..
మరి నాకు మాత్రమే ఎందుకు
అంది అందనంత ఎత్తులో…
దొరికి – దొరకనంత దూరంలో ఉంటావు..
నా హృదయాన్ని నిలువునా కోస్తున్నావు..
అయినా భరిస్తున్నాను….
నొప్పిగా ఉందంటే ఎక్కడ వెళ్ళిపోతావో అని..
తెల్లవార్లూ మెలుకువగానే ఉంటున్నా..
ఏ నడిరేయి నాకోసం వస్తావో అని…
అప్పుడు కలతనిద్రలో నేనున్నా నువ్వు అలిగి వెళ్ళిపోతావేమో అని..
ప్రతి రోజు ఆకాశాన్ని చూస్తూ…
నీకై రెండు చేతులు చాపి ఉంచుతా…
ఏ గాలి నీ స్పర్శలా నన్ను తాకుతుందో అని ..
అయినా నీ జాడ లేదు…
నిన్ను అన్వేషించే క్రమంలో..
ఒక జీవిత కాలం ముగుస్తుందేమో అని
భయంగా… బాధగా.. ఉంది..
ఇకనైనా నన్ను కరుణించి..
నా దరి చేరవా.