సామాజిక మాధ్యమాలు-బడిగంట

సామాజిక మాధ్యమాలు-బడిగంట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన:రాధ ఓడూరి

సామాజిక మాధ్యమాలు
చరవాణి చేతిలో మర్కటమై
ముఖపరిచయం లేని వ్యక్తులను తన ఖాతాలో రెట్టింపు చేసుకుంటూ
మెసెంజర్లు రాత్రి నిద్రని పాడుచేస్తూ
వాట్సప్ నీతులు ఫార్వర్డ్ కే తప్ప
పాటించటానికి కాదంటూ
ట్విట్టర్లు సమాజంలోని వెతలు చూపకుండా
వెకిలి రాతలకు నిలయమై
ఇన్ స్టాగ్రాంలు కళలకు నిలయం కాక
పోకీరీ చేష్టల ఖాతాలా
మారి కరోనా వ్యాధి కన్నా తీవ్ర ప్రభావాన్ని చూపకముందే
బడిగంటల సమయంలా ఇంటర్నెట్ కి సమయం ఉంటే బాగుండును కదా! అప్పుడే…!!
కుటుంబాల బంధుత్వాలు బలపడి
బాల్యం బంధీకాక క్రీడలందు ఆసక్తి కలిగి
స్నేహితులందురు సఖ్యతతో మెలిగి
మానసిక ఎదుగదలకు రాచబాట ఏర్పడును

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!