అశ్వత్ద వృక్షం

అంశం: అంతు చిక్కని రహస్య ప్రదేశాలు

అశ్వత్ద వృక్షం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

ఈ విశ్వంలో ఎన్నో ఎన్నెన్నో రహస్య సావరాలు ద్వీపాలు, విభిన్న రాజుల రహస్య ప్రదేశాలను యుద్దములలో దాగుకోని ప్రాణ రక్షణ దేశ రక్షణ కోసం ఎన్నో రకాల పద్దతులు ప్రదేశాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఇప్పటికీ ఎన్నో అంతు చిక్కని అంశాలు ఉన్నాయి అవి చేధించడం మహా కష్టము. కొందరు సైంటిస్ట్ లు నాస్తికులు వారి వారి పద్దతుల్లో ప్రయత్నాలు చేసినా వారికి అంతు చిక్కనివిగా మిగిలాయి. వాటిలో కొన్ని…
పాండవులు, కౌరవులు పట్టుదలకు వెళ్లి పాచికలాటలో రాజ్యాన్ని కోల్పోయి అజ్ఞాత వాసంలో ఉన్నప్పుడు రహస్యంగా అశ్వత్దవృక్షం పై వారి ఆయుధములు అన్ని చాప చుట్టాల చుట్టి చెట్టు కొమ్మల మధ్యలో దాచి వెడతారు.
విరాట్ రాజు కొలువులో ఐదుగురు పరాక్రమ వంతులు అయిన సరే సామాన్య వ్యక్తులు మాదిరి వివిధ పదవుల్లో రాజ దర్బార్ లో ఉన్నారు.
ధర్మరాజు కంకు బోట్లు గాను రాజ దర్బారులో చేరితే, భీముడు వంటవానిగాను, అర్జునుడు బృహన్నలగా నాట్య చార్యునిగా, ఉత్తరకు నాట్యం నేర్పేవారు. నకుల సహదేవులు గుర్రాల సంరక్షణలో గడిపారు. ద్రౌపది సైరంద్రిగా మహారాణి పరిచారికగా, అంత గొప్ప రాణి సామాన్య వ్యక్తిగా కాలం గడిపారు. ఎంతో పరాక్రమ వంతులైన భర్తలు ఉన్న సరే ఆమె రహస్య వేషంలో గడిపారు.
శ్రీ కృష్ణుని ఏ విధమైన సహాయం కోరకుండా వారి పరాక్రమం పై ఆధారపడి ఉన్నారు. కృష్ణుడు వారిని రక్షిస్తూ క్షణక్షణం ఎదో రకంగా కాపాడాడు. ద్రౌపది ఒక్కసారి అన్నా అనగానే వచ్చి చీరలు ఆమెకు ప్రసాదించాడు. శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునునికి శ్రీ భగవద్గీత బోధించాడు, ఇలా ఎన్నో పురాణ గాథలు ఉన్నాయి. కొన్ని మంత్రాలు రహస్యంగా చదవాలి బయటకు పలుక కూడదు ఎవరూ వినకూడదు అని పెద్దలు పూరణలు చెపుతున్నాయి.
సైన్స్ ప్రకారం అంతు చిక్కని ఎన్నో రహస్య ప్రదేశాలు గాథలు ఎన్నో ఉన్నాయి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!