పాలా – విషమా?

పాలా – విషమా?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : ఎస్.ఎల్. రాజేష్

బలహీనంగా ఉందని డాక్టర్ల దగ్గరకి వెళ్తే ఇచ్చే మొదటి సూచన. మీరు పళ్ళు, పాలు విరివిగా తీసుకోవాలి అని. కొంతమంది కి టీ, కాఫీలు లేకుండా రోజు గడవదు. మరి ఆవే పాలు కలుషితమై అనారోగ్యాల పాలు చేస్తుంటే ఏం చేయాలి. ఎవరిని అడగాలి. నేటి తరం పిల్లల్ని పాలు ఎక్కడి నుండి వస్తాయి అని అడిగితే “పాకెట్ల ద్వారా ” అని వెంటనే చెబుతారు. ఎందుకంటే వాళ్ళకి పాడిపంటలు అంటే ఏమిటో తెలియదు కాబట్టి. ” కాదు బర్రెలు, ఆవుల నుండి పాలు వస్తాయని చెబితే ఇంకా మనం వెర్రి వాళ్ళమే అవుతాం. పెరుగుతున్న జనాభా కు సరిపడా పాలు ఇవ్వగల పశు సంపద మన దగ్గరలేదు. అందుకే అక్రమార్కులకు ఇదొక వరంలా మారింది. సమాజానికి ముప్పు వాటిల్లింది. యూరియా, ఫార్మాలిన్ వంటి విష పదార్థాలు కలిపి పాలను తయారు చేసి మార్కెట్లోకి వదులుతున్నారు. అంటే కాక పాల పొడి గంజి పొడిని కూడా కలిపి పాలు తయారు చేస్తున్నారు అంటే మనం ఎంత గుడ్డిగా ఉన్నామో అర్థమవుతుంది కదా. చిక్కదనం కోసం యూరియా, నురుగు కోసం డిటర్జంట్లు కలిపి పాలు పేరుతో అమ్మేస్తూ ప్రజా ఆరోగ్యాన్ని గంగలో కలుపుతున్నారు. పాలల్లో ఏముంటాయి అని అడిగితే వెన్న, లవణాలు, ఖనిజాలు, విటమిన్లు, చక్కెర ఉంటాయని చెబితే హాస్యాస్పదం అవుతుంది. నేటి పాలల్లో సోడియం బై కార్పోరేట్, హైడ్రోజన్ పెరాక్సైడ్, పార్మలైన్ వంటి కలిసి విష ఆస్పత్రుల పాల్జేస్తున్నాయి. అధిక పాల ఉత్పత్తి కోసం ఆక్సిటోసిన్ లాంటి హార్మోన్ ఇంజెక్షన్లు పశువుల కు ఇస్తున్నారు. స్వచ్చమైన పాలు సకాలంలో వేడి చేయకపోతే 4 గంటల తర్వాత విరిగిపోతాయి. అందువల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం వంట సోడా లేదా సోడియం బై కార్బోనేట్ ను కూడా కల్తిదారులు కలుపుతున్నారు. వీటి వల్ల పాలు విరగ కుండా 4 రోజులైన ఉంటాయి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!