మరువగలమా

మరువగలమా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బుదారపు లావణ్య

గడిచిన కాలపు
జ్ఞాపకాల పూదోటలో
విరబూసిన
నవ్వుల పూలెన్నో
మదినిండా చేరువై
మమతల రాగాలు
పాడిస్తుండగా…..

చిలిపి తనపు చిన్ననాటి
చిరకాల గుర్తులేవో
మదిలోయలో
వలపు వీణలు
పలికిస్తుండగా….

విడనాడని
స్నేహబంధమేదో
వడివడిగా రమ్మనుచూ
అల్లరి ఆటల
చిలిపి చేష్టలను
అనునిత్యం
కళ్ళముందుంచుతుండగా….

ఆ కమ్మని జ్ఞాపకాల
కమనీయమైన కాలపు
అల్లరి నేస్తాల
ఆటపాటల
చిలిపి చేష్టలను
మరణంలోనైనా
మరువగలమా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!