అన్వేషిస్తున్న నా జాడకై

అన్వేషిస్తున్న నా జాడకై
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొత్త ప్రియాంక (భానుప్రియ)

అనంతపు అవనిలో జానెడు జాగ కోసమై నిరంతరం అన్వేషిస్తున్న….
అంతట నా పరిమళాలను వెదజల్లలని పరితపిస్తున్న.
రంపపు కొత తో నా హృదిని చీలుస్తున్న చిరునవ్వుతో మరల చిగురిస్తున్న….
అభివృద్ధి వేటలో ఊపిరి ఉనికిని ప్రశ్నార్థకం చేస్తూ పరిగెడుతున్న ఓ సమాజమా!
ప్రాణవాయువు కరువై అల్లడిన, అల్లాడుతున్న  క్షణాలు గుర్తులేవా
ఆకాశహర్మ్యాలు నన్ను చూసి వెక్కిరించే కానీ వాటికి తెలియదు నేను లేని జగతి  నిరర్ధదాయకమని… ‌
విలపించే పుడమి తల్లి నా ఆనవాళ్లు లేక…
ప్రకృతి నుదుట పచ్చని సింధూరం లేక బోసిపాయె.
నింగి సైతం తొంగి చూసే కానరాని నా జాడకై…
వన్యప్రాణుల సంరక్షణ ఆలంభనకు నేనే కదా ఆదెరువు.
చిగురించే వసంతానికి ఆహ్వానించే ఆప్తులు కరువై పండుటాకునై రాలిపోతున్న….
నిర్దా‌క్ష్యంగా తుంచేస్తున్న మకరందపు
మాధుర్యం మధురంగా వెదజల్లుతున్న…
చల్లని ఝంఝామారుతానై నలు దిక్కులు వ్యాపించి నిరంతరం నిన్ను  హత్తుకుంటున్న…..
నా నిస్వార్థమైన ప్రేమ తో అడుగడుగున ఆదర్శమైన మహాప్రస్థానమై జగతి లో నిలుస్తున్న…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!