నా  పల్లె  సుగుణాలు!!

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

నా  పల్లె  సుగుణాలు!!
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సువర్చల

తెల్లవారుజామున నిదుర నుండి తట్టిలేపే…
కోడి కూత వాకిళ్ళు!!
మా ఇంటికి రండి అంటే
మా ఇంటికి  రమ్మనే.. మంచి ముత్యాల ముగ్గులు!!
ఎవరినైనా సేద తీరమని నీళ్ళను ఇచ్చే..
మనసున్న మట్టి అరుగులు!!
ప్రేమలకు బంధాలకు విలువనిచ్చి పలకరించే..
చక్కటి చలువ చిరునవ్వులు!!
కష్టం అంటే పదిమంది కూడి ఆసరానిచ్చే..
పాతకాలపు మొండి అభిమానాలు!!
అందానికి ఆనవాలుగా నిలిచి పులకరించే..
పచ్చని చీర సింగారించిన పంట పొలాలు!!
గొడవలు వస్తే నిలదీసి న్యాయం చెప్పే..
ఊరి మద్య రచ్చబండ!!
ఏటేటా సంబరాలను అంబరానికి అంటిచే..
మా గ్రామదేవతల కొలుపులు!!
అంకుల్ ఆంటీ అంటూ అంటీ ముట్టని హొయలు కాదు,
అత్తా మామ అంటూ మమకారాల హాయి మధురిమలు !!!
పల్లెను వీడి పట్నం చేరినా,
వీడక వెన్నంటే నడిచే మధుర  జ్ఞాపకాలు !!
పట్నామా – నా పల్లె సుగుణాలు నీలొ లేవమ్మా !!

You May Also Like

2 thoughts on “నా  పల్లె  సుగుణాలు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!