నిశీధి

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

నిశీధి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

నా జ్ఞాపకాల నీడలలో నువ్వెన్నడు కంట నీరు కార్చకు,
నీ వెన్న వంటి హృదయాన్ని కాల్చి కరిగించకు,
నన్ను మర్చిపో ప్రియతమా!
దుఃఖ భరితమైన నా గుండె వ్రక్కలై పదేపదే అక్రోసిస్తు చెప్తుంది,
నీ అమూల్యమైన  ప్రేమకు నేను తగనని,
నను మన్నించు ప్రియా,!
దూర తీరాలలో గమ్యం వెతుక్కుంటూ,
ఒంటరినై పోతున్నా,
నీ లోకంలో నువ్వు నీ దారిలో
“నిండు పసుపు కుంకుమలతో” కలకాలం జీవించు
ప్రియా,!
నీ తియ్యని జ్ఞాపకాల నీడలలో, ఆవిరై పోతున్నా!
నన్ను మనసారా క్షమించమని కోరుతూ,
నీవాడు కాలేని నిర్భాగ్యుడు,
“నీ జ్ఞాపకాల నిశ్శబ్దంలో ‘నిశీధినైపోతా!’ పియతమా!!.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!