అంతా మన మంచికే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సుజాత కోకిల
మనిషికి తోడు లేనిది జీవితం అవందనం
కనులకు కాటుక అందం
ఆడతనానికి సొగసు అందం
మనిషికి మనసు అందం
పాపాయికి అల్లరి అందం
బిడ్డకు అమ్మ అనురాగం అందం
వృద్దాప్యంలో కాలక్షేపం అందం
ఆప్యాయంగా పిలిచే పిలుపు అందం
మనకు ఆనందాన్నిచ్చే ప్రకృతి అందం
వెన్నెల ప్రేమించే మనసులకు అందం
చేయి అందించే నాన్న బంధం అందం
అనురాగాలు పంచె అన్నదమ్ముల ప్రేమ అందం
ఆప్యాయతలను పంచే అక్కాచెల్లెళ్ల ప్రేమ అందం
మేమున్నామంటూ అక్కను అనుసరించి
పెళ్లిలో మేనకోడలు చెయ్యందుకొని
ముందుకు నడిచి పెళ్లి పీటలపైకి నడిపించే మేనమామ బంధం అందం
సాంప్రదాయాల పెళ్లిళ్లు అందం
జీవితాంతం కలిసి ఉండే భార్య భర్తల బంధం అందం