శ్రీరామ నవమి

శ్రీరామ నవమి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కాటేగారు పాండురంగ విఠల్

చైత్ర నవమి శ్రీరాముని పుట్టిన దినము
సీతారాముల కళ్యాణం జరిగిన దినము
రావణుణ్ణి చంపి రాముడు అయోధ్యకు చేరి
రాజ్య పట్టాభిషిక్తుడైన శుభ దినము
తండ్రి మాట జవదాటక కానలకేగెను
ఏక పత్నీ వ్రతుడై ఆదర్శము చాటెను
వసంతంలో వచ్చే పరమపవిత్రోత్సవం
హిందువులకారాధ్య దైవం శ్రీరాముడు
గుళ్లల్లో మధ్యాహ్నం పూజ నిర్వహిస్తారు
పానకం వడపప్పు ప్రసాదంగా స్వీకరిస్తారు
రాక్షసగణ సంహారకుడు పురుషోత్తముడు
భక్తజన హృదయాల్లో వసించును మాధవుడు
విష్ణుమూర్తి ప్రతిరూపంగా వెలిశాడు
ఆదర్శ పాలకునిగా ప్రఖ్యాతి గాంచాడు
రామ నామం జపిస్తే మోక్షం లభించును
శ్రీవిష్ణుసహస్ర నామతుల్యంగా భావించబడును
పాప శాప తాప సంహారిణి రామ నామం
భక్తి రక్తి ముక్తి ప్రదాయిని శ్రీరామ నామం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!