నా ఘోర తపస్సు

నా ఘోర తపస్సు
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: ఉత్కర్ష

టీవీలో స్క్రోలింగ్, టీవీ సీరియల్స్ బ్యాన్ చేసారు అని. ఆ న్యూస్ చూసిన మా అత్త, ఆడబిడ్డ ఉన్నటుండి కుప్ప కూలిపోయారు. వారి దుఃఖానికి అంతం లేకుండా పోయింది. తీస్కెళ్లి ఇద్దరిని హాస్పిటల్ లో అడ్మిట్ చేసేసాం. ఓరి దేవుడా వాళ్ళని నువ్వే కాపాడాలి తండ్రి, కాపాడితే మా అత్త, ఆడబిడ్డలకు గుండ్లు కొట్టిస్తా అని ఆ వెంకన్న సామిని మొక్కుకున్న. సీరియల్స్ మళ్ళీ రాకపోతే అత్తకు హార్ట్ ఎటాక్ ఆడబిడ్డకు పక్షవాతం వచ్చే సూచనలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పేసారు.
అమ్మ, అక్కల పరిస్థితి చూసిన నా మొగుడి దుఃఖానికి అంతం లేకుండా పోయింది. ఇక నువ్వే ఏదైనా చేసి రెండు నిండు ప్రాణాలను కాపాడాలని చేతులు పట్టుకుని వేడుకుంటే ఇక తప్పదని, నాన్న ఫార్మ్ హౌస్ దగ్గరి గుట్టలోని ఒక గుహలో ఘోరంగా తపస్సు మొదలు పెట్టిన.
రోజులు గడుస్తున్నా దేవుడి జాడ లేకపాయే. సుట్టు పుట్టలు లేసి పాములు రాబట్టే, ఇగ ఒక రోజు దేవుడి దగ్గరి నుండి ఒక వాట్సాప్ మెసేజ్ టంగ్ మని వచ్చింది
అమ్మ తల్లి నేను శ్రావణ మాసం వ్రతాలతో ఫుల్ బిజీ గా ఉన్న, లక్ష్మీని ఈ ఇల్లు ఆ ఇల్లు డ్రాపింగ్, పికప్పింగ్ తో చచ్చిపోతున్న నీ దగ్గరికి నేను రాలేను గాని నీ సమస్య తీర్చే వీరుణ్ణి పంపుతున్న, అని వేచి వుండమ్మ జర అని ఆ మెస్సేజ్ సారాంశం.
సరే అని ఎవరోస్తారా అని ఆత్రంగా ఎదురు చూస్తున్న. ఇంతలోనే ఫెళ ఫెళ మని ఉరుములు, ఎక్కడో పిడుగులు పడ్డ భీకర శబ్దాలు నక్కల అరుపులు, కుక్కల మెరుగులు. భయంతో గజగజ వణుకుతున్న నన్ను రెండు చేతులు ఆపాయి.
కండ్లు తెరిచి చూద్దును కదా ఎదురుగా సంపూర్నేష్ బాబు. సంతోషంతో నోట మాట రాక మిడి గుడ్లేస్కుని చూస్తున్న నాకు అభయ హస్తం ఇచ్చిన సంపూ కిందా మీదా పడి, తన విశాలమైన హృదయ కాలేయాన్ని చేతితో పట్టుకొని, ధైర్య సహసాలతో తన అపారమైన వాగ్ధాటితో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని టీవీ చానెల్స్ యజమానులతో సుదీర్ఘ చర్చలు జరిపి సీరియల్స్ బ్యాన్ ని ఎత్తి వేసేలా చేసాడు. తన అవిరామ కృషితో నా అత్త, ఆడబిడ్డకు ప్రాణం పోసిన దేవుడైనాడు సంపూ.
ఇగ మా అత్తని అడబిడ్డని హాస్పిటల్ నుండి ఇంటికి తీస్కోచ్చినం. ఇద్దరు ఖుషిగా సీరియల్స్ చూస్తున్నారు
నేను మా ఆయన ఊటీకి వెకేషన్ కి బయలుదేరినం సంబరంగా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!