తెలుగు వారసులము
రచన:: పుల్లూరి సాయిప్రియ
సృష్టి మొదలు నుండి..
ఏలాంటి మచ్చ లేని తెల్లని కాగితంలా..
మన మనస్సు ను పులకరించే చల్లదనంలా..
సంస్కృతం నుండి పురుడొసుకున్న నా భాష..
కోయిల రాగం లా.. మయూరి నాట్యంలా..
స్వర..సుస్వరాల పదాలను విహరింపజేసి
కనువిందు చేసిన సంగీతానికి ముద్ర వేసిన భాష నా తెనుగు భాష..
ఊటా బావులలో తియ్యటి నీరు లా..
ఎంతో మదురమైన చక్కర పాకం లా..
ఉగ్గు పాల నుండి ఉయ్యాలలో ఊగినప్పుడు..
అమ్మ పాడిన నట్టి భాష నా తెనుగు భాష..
అందుకే అలనాడే అన్నారు మన రాయలవారు..
“దేశ భాషలందు తెలుగు లెస్స” అని..
అమృతాన్ని విరజిమ్ముతూ విశ్వ జనులను ఆకర్షింప జేసిన భాష నా తెనుగు భాష..
మైమరిపించి, పులకరించి..
తేనెలోలుకు భాష నా తెనుగు భాష..
మన తెలుగు తల్లి ఒడిలో నుండి ఆవిర్భవించిన వారసులము మనము.
***