కనిపించే దేవుళ్ళు
చెరుకు శైలజ
తల్లిదండ్రులు కని పెంచిన దేవుళ్ళు
సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు
జీవితంలో ఏది కోల్పోయిన తిరిగి పొందవచ్చు.
తల్లిదండ్రులను కోల్పోతే తిరిగి పొందలేము.
మరో జన్మ ఎత్త వలసిందే
బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు.
తల్లిదండ్రులు జీవితం ఇస్తారు.
తల్లిదండ్రుల పట్ల ప్రేమ అభిమానాలు కలిగి ఉండాలి.
ఎత్తుకు ఎదిగిన పిల్లలను చూసిన తల్లిదండ్రుల
కళ్ళలో మెరిసిన మెరుపు ఎంతో విలువైన సంపదతో సమానం.
డబ్బు పోతే సంపాదించుకోవచ్చు .
తల్లిదండ్రులు పోతే మళ్ళీ సంపాదించుకోలేము.
తల్లిదండ్రులు బిడ్డలపైన చూపేది నిస్వార్ధమైన ప్రేమ
అమ్మ ఒడిలో పెరిగిన నీవు
అమ్మను నీ గుండెలో గుడిగా మలచుకో
నాన్న అడుగులో అడుగు వేసి అందనంత ఎత్తుకు ఎదిగిన
నీ మనసులో తనని నిలుపుకొని తల్చుకో
వారిని మర్చిపోకు
కంటికి రెప్పలా చూసుకో
వృద్ధాశ్రమంలో వదలకు
తల్లిదండ్రుల పాదాలకు సేవ చేయి
ఎన్నో దేవుళ్ళను పూజించినంత పుణ్యం
దేవుడు ఎక్కడో లేడు
నీ తల్లిదండ్రుల రూపంలో నీముందే ఉన్నాడు.
తల్లిదండ్రుల కోసం ఒక్క రోజు జరుపుకోవడం కాదు
ఆజన్మాంతం వారిని స్మరిస్తూనే ఉండాలి.
సేవ చేస్తూ పూజిస్తునే ఉండాలి.
అప్పుడే వారి బిడ్డలుగా నీ జన్మ తరించు.
***