తల్లి
రచన:: కాకు మాధవిలత
తల్లి నీకు వందనం
ఇదే నా అభివందనం
నీ మనస్సు పుడమితల్లి కన్న గొప్పది
నీ ప్రేమ అనంతమైనది
నీ లాలన ప్రకృతి ఒడిని మించినది
నీ కోపము అమృత వర్షిని వంటిది
తల్లీ నీకు వందనం
ఇదే నా అభివందనం
తల్లీ నీ ఆకలిని దాచుకుంటావ్!
బిడ్డల ఆకలి తీరుస్తుంటావ్!
అమ్మ నీ కోరికలు దాచుకుంటావ్!
అందరి కోరికలు తీరుస్తుంటావ్!
లేరు నీకు సాటి ఎవ్వరూ!
లేరు నీకు పోటీ ఎవ్వరూ!
తల్లీ నీకు వందనం
ఇదే నా అభివందనం
బిడ్డల అభివృద్ధికి పాటుపడతావ్!
వారి ఉన్నత స్థానాన్ని చూసి మురిసి పోతావ్!
ఎప్పుడూ మా కోసం పరితపిస్తావ్
మా లో నిన్ను చూసుకుంటావ్
తల్లీ నీకు వందనం
ఇదే మా అభివందనం.
***