ఉద్యోగ ప్రస్థానం

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

 ఉద్యోగ ప్రస్థానం

రచన: దుర్గా మహాలక్ష్మి ఓలేటి

అది 2010 సెప్టెంబరు 4th. సాయంత్రం నేను Para teacher పనిచేసే స్కూల్ లో వాతావరణం మంచి హడావిడిగా వుంది నేను అప్పుడే 10 వతరగతి బయాలజీ క్లాస్ ముగించుకుని బయటకు వచ్చాను. ఏమిటి హడావిడి అని పక్కన నాతో పాటే పనిచేసే టీచర్ ని అడిగితే, యానం మొన్న జరిగిన టీచర్ రిక్రూట్మెంట్ రేసుల్ట్స్ వచ్చాయి అన్నారు.
నేను హడావిడిగా వెళ్లి లిస్ట్ చూసా.. ఎందుకు అంటే నేను రాశాను ఎగ్జాం ఎక్కడో ఒక చిన్న నమ్మకం కష్టపడి నిజాయితీగా రాశాను కదా జాబ్ వస్తుంది లే అని, మళ్లీ ఒక పక్క అపనమ్మకం నా చదువు అంతా ఆంధ్రలో జరిగింది, అంతే కాక నేను పెద్ద వాళ్ళని ఎవరిని కలవలేదు, హాల్ టిక్కెట్ ఇచ్చి కాకా పట్టడానికి వెళ్ళలేదు. నాకు రాదేమోలే అని ఇంకో పక్క అపనమ్మకం. నాలో నేనే పరి పరి విధాల మనసులో సంఘర్షణ మూడవ ప్రపంచ యుద్దం మొదలై నమ్మకం అపనమ్మకం నువ్వా నేనా అని హోరా హోరీగా తల పడుతున్నాయ్.
తీరా నోటీస్ బోర్డ్ లో రిసల్ట్ లో నా పేరు వెయిటింగ్ లిస్ట్ చూసే సరికి నవ్వాలో ఏడ్వాలో తెలియని అయోమయం దుస్థితి. అప్పటికే నేను వాలంటీర్ టీచర్ గా క్రమశిక్షణకు నిజాయితీకి డెడికేషన్ కి బ్రాండ్ అంబాసిడర్గా అతి తక్కువ సమయంలోనే ఎంతో గొప్ప పేరు, అభిమానులను సంపాదించుకున్న నన్ను నా పనిని ఇష్టపడి మెచ్చుకునే సీనియర్ టీచర్స్ నాకోసం బాధ పడుతూ పాపం O.D.M. (అందరూ నన్ను షార్ట్ కట్ లో పిలిచే పిలుపు Oleti దుర్గా మహాలక్ష్మి.), మినిస్టర్ గారిని కలవలేదు ఏమో అని మరీ కొద్ది మంది, అయ్యో ఆవిడకి తప్పని సరిగా రావాలి ఆవిడ టాలెంట్ కి అని కొందరు నిట్టూర్పులు విని నా మనసు మరింత బరువెక్కింది. ఇక ఎంత ఆనకట్ట వేసి ఆపినా హృదయం ఆవేదనా అడ్డకట్టలని తెంపుకుని మరీ నేత్ర ద్వారాలను సైతం గెంటుకుని వరద ప్రవాహ ఉదృతి ఆపలేక స్కూల్ లోనే బోరున అశ్రువుల వర్షం.. ఆపడం ఎవరికీ సాధ్యం కాలేక పోయింది.
కానీ దంగేటి.వేంకటేశ్వర రావు సీనియర్ సోషల్ మాస్టారు మాత్రం బాధ పడకు అమ్మ నీ కష్టానికి ఫలితం ఎప్పుడూ వృధా పోదు.. అన్న మాట ఎప్పటికీ మరచి పోను, అలాగే physics మాస్టారు బాబీ గారు మేడం గారు మీ పేరు వెయిటింగ్ లిస్ట్ లో వుంది కదా ఒక్కసారి మినిస్టర్ గారిని (అప్పటి మినిస్టర్ గారు మల్లాడి కృష్ణారావు గారు) ఒక్కసారి కలవండి అని చెప్పారు. నాకైతే అసలు ఎవరి దగ్గరకు వెళ్ళి నిలబడడం చేయని పని. నాతో పాటు ఇంకో ఇద్దరు వెయిటింగ్ లిస్ట్ లో వున్నారు అందులో నాయుడు మాస్టారు ఆయనే అనుకోకుండా నన్ను కలిసి ఒకసారి మినిస్టర్ గారి దగ్గరకు వెళ్ళి కనిపిస్తే బావుంటుంది అని చెప్పడంతో మా అమ్మాయి జోషి 2ఏళ్ల పిల్లని ఎత్తుకుని ఒకసారి కనిపించాం.
ఆయన పుదుచ్చేరి ఫోన్ చేసి మాట్లాడడం చేసేవారు. కాకపోతే నాకు తెలియని ట్విస్ట్ ఇంకొకటి వుంది. మా లిస్ట్ లోని రాజ్యలక్ష్మి గారు ఆర్టీఐలో మా మార్క్స్ సేకరించి మెరిట్ వచ్చిన వాళ్ళకి జాబ్ ఎందుకు ఇవ్వలేదు అని ప్రభుత్వం మీద కేసు వేయడం ప్రభుత్వమే మాతో రాజీ కి వచ్చి కేస్ వెనక్కి తీసుకోమని కోరడం, డిపార్ట్మెంట్ లో వున్న ఇంగ్లీష్ పోస్ట్స్ ని రెండు physical సైన్స్ గాను ఒకటి బయాలాజికల్ పోస్ట్ గని కన్సర్ట్ చేసి ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలక్షన్ కోడ్ కి గంట ముందు ఫ్యాక్స్ పంపడం.. జరిగిపోయింది.
ఇదంతా నాకు తెలియకుండానే నాకు ఫోన్లో కంగ్రాట్స్ చెప్పడం, అంతా మిరాకిల్ ఇంకో విషయం ఏమిటి అంటే ఆ మరుసటి రోజు నా మొబైల్ నంబర్ కనుక్కుని స్థానిక యానాం ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బందిని మా ఇల్లు కనుక్కుని వెళ్ళమని పంపారు. అప్పుడే వోకల్ ప్రాబ్లెమ్ కోసం హాస్పిటల్ కి వెళ్లి వచ్చేసరికి.. మా ఇంటికి వచ్చిన ఓల్డ్ ఏజ్ హోమ్ సిబ్బంది మట్టపర్తి చిన్నా గారు ఫోన్ ఇచ్చి మాట్లాడమన్నారు నాకు అంతా అయోమయం అవతల ఫోన్ లో అమ్మాయ్ రేపే జాబ్ లో జాయిన్ అయిపో అని. అలాగే సర్ అని నేను.
ఇంతకీ అవతల వ్యక్తి మినిస్టర్ గారు.
ఎక్కడి నుండో వచ్చి జాబ్ కొట్టడం ఏమిటి అని కొద్ది మంది అదృశ్య వ్యక్తులు అప్పాయింట్ మెంట్ ఆర్డర్ ని కూడా నాకు అందనివ్వలేదు. ఏది ఏమైతనేం జాయినింగ్ రిపోర్ట్ మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అన్నీ అలా లీలగా జరిగిపోయాయి. అదీ 2011 మార్చ్ 4th అమావాస్య శుక్రవారం యానంకి 15 కిలోమీటర్ల దూరంలో అంతకు ముందే పారా టీచర్ గా పనిచేసిన పెరుంతలైవర్ కామరాజర్ ఉన్నత పాఠశాలలో ఒక సంవత్సరం తరువాత ప్రభుత్వ ఉపాధ్యాయినిగా నా ఉద్యోగ ప్రస్థానం.
చదివిన చదువుకి సార్థకత నేను ఎదురుచూసిన రోజుకి పరమార్థం. ఎప్పటికీ మరచి పోలేని ఒక అద్భుత మయిన ఘట్టమే నా జీవితంలో.
ఇంకా సంతోషం ఏమిటి అంటే ఒక సంవత్స క్రితం నేను వదిలి వెళ్ళిన పిల్లలు నన్ను చుట్టూ ముట్టి టీచర్ అప్పుడు వెళ్లి మళ్లీ ఇప్పుడు వచ్చారా నాకోసం అనే ఆ మాటల్లో ప్రేమ జీవితానికి సరిపోయేంత. ఇప్పటికీ తరగలేదు ఆ పిల్లల ప్రేమ.

నా జీవితం అనేక అద్భుత సంఘటనలలో ఇది ఒకటి
***********

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!