దేవుడు ఉన్నాడా!?

కథ అంశం: మిరాకిల్స్
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

దేవుడు ఉన్నాడా!?

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

ప్రతి ఏడు బొబ్బిలి దాడితల్లమ్మా జాతర ఎక్కడెక్కడి జనాల రాకతో చాలా సంబరంగా, కొలహలంగా జరుగుతుంది. ఎక్కడేక్కడి నుండో చుట్టాలు, స్నేహితులు ఆ ఊరిలో బంధువుల ఇంటికి వచ్చి, ఆ మూడు రోజులు ఎంతో సందడిగా, కన్నుపండగగా జరిగే‌ అమ్మవారి జాతరను, సిరిమానోత్సవంను వీక్షించి, మంగళవారం రాత్రాంతా దారి పొడుగున ఇచ్చిన బలుల త తాలుకా వేట మాంసంతో బుధవారం మధ్యాహ్నం విందు ఆరగించి, తమ ఇళ్లకు వెళ్తారు.
ఆ ఏడు కూడా యథాప్రకారం ఆ ఊరిలో దాడితల్లమ్మా జాతర సంబరాలు మొదలయ్యాయి. ఎక్కడెక్కడి నుంచో జనాలు సిరిమానోత్సవం, జాతర సంబరాలు చూడటానికి వచ్చారు.
మంగళవారం మధ్యాహ్నం అయ్యేసరికి, ఇంటి ముందుకీ ఘట్టాలు వచ్చే వేళకు ఊరంతా వీధులలో నిలబడి ఘట్టాలు రాక కోసం ఎదురు చూస్తున్నారు.
అంతలో ఆ గుడి పూజారీ మీద పూనీన అమ్మవారు, పళ్లతో మేక మెడను కొరికి, పేగులను మెడలో వేసుకుని, ఊరు చుట్టడానికి బయలుదేరారు.
ఇంతలో, ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఒకామె..
“ఇదంతా ఉట్టిదే. అమ్మవారు ఎలా మనుషుల మీదకు వస్తారు!? ఎలా ఉట్టి పళ్లతో మేక మెడను కొరుకుతారు!?” అని తనతో పాటు పక్కన నిలబడి జరుగుతున్న తతంగం చూస్తున్న ఆమెను సందేహంగా అడిగింది.
ఇంతలో ఆ వీధిలోకి ఘట్టాలు రానే వచ్చాయి.
అంతవరకు అమ్మవారి గురించి అపనమ్మకంగా మాట్లాడిన ఆమె, ఆ ఘట్టాలను చూస్తూనే, పూనకం వచ్చినట్లు ఊగిపోతూ.. అమ్మవారి ఘట్టాలను అందుకుని, తల మీద పెట్టుకుని, ఇంటింటికి నడిచి, పూజలు అందుకోవడం మొదలెట్టింది.
అదంతా చూస్తున్న ఆ వీధిలో వారికి, ఆమె మీద అమ్మవారు వచ్చిందని అర్థమై, బిందెల కొలది నీళ్లతో తల మీద నుండి అభిషేకం చేసి, ఆమె పాదాలకు, ముఖానికి పసుపు రాసి, బొట్టు పెట్టి, పూజలు చేయడం మొదలుపెట్టారు.
అలా కొంతసేపటికి, ఘట్టాలను తల మీద పెట్టుకుని, ఆ వీధిలో ఇళ్లన్ని తిరిగేసి, అక్కడే‌ సృహ తప్పి పడిపోయింది ఆవిడ.
ఆ తర్వాత వాళ్లాయన, ఇరుగు పోరుగువారు చేసిన సేవలతో తెప్పరిల్లిన ఆమె,
“ఏం జరిగింది!? ఎందుకు మీరంతా నా చుట్టు ఉన్నారు!?” అని అడగడంతో ఆశ్చర్యపోవడం ఆ వీధి వారి వంతు అయింది.
ఆ తర్వాత నుండి ప్రతి ఏడాది ఆమె స్వయంగా ఘట్టాలను ఎత్తుకుని మొక్కు చెల్లించడం కోసమెరుపు.

ఇది స్వయంగా నా కళ్లేదురుగా జరిగిన సంఘటన. “దేవుడు లేడు” అనేవారికి “ఉన్నాను” అని నిరూపించే, ప్రత్యక్ష నిదర్శనం ఈ సంఘటన.

ఈ సంఘటన ప్రత్యక్షంగా నా కళ్లేదురుగా జరిగింది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!