బిచ్చగాడు

బిచ్చగాడు

రచన: కమల ముక్కు (కమల’శ్రీ’)

కష్టం లో ఉన్నప్పుడే తెలుస్తుంది
అయినోళ్లెవరో కానోళ్లవరో
బాధల్లో ఉన్నప్పుడే తెలుస్తుంది
చుట్టాలెవరో చూసి పోయేది ఎవరో//

కష్టాన్ని తీర్చలేకపోయినా
కన్నీటిని తుడిచి
నీకు మేమున్నామంటూ
భరోసా ఇచ్చేవారే నిజమైన అయినోళ్లు//

బాధలు పాలు పంచుకోక పోయినా
నాలుగు మంచి మాటలు చెప్పి
ఓదార్పు చెప్పేవాళ్లే
అసలైన బంధువులు//

ఈ రోజుల్లో బంధాలూ అనుబంధాలూ
డబ్బుల వలలో చిక్కుకుని
ఆత్మీయతకు తూట్లు పొడుస్తుంటే
అనురాగానికి నీళ్లొదిలేస్తుంది//

ఆ వలకి చిక్కకుండా చాకచక్యంగా
తప్పించుకు తిరుగుతూ
బంధాలను కాపాడుకునే వారెవరైనా
ఉన్నారంటే వారు గొప్పవారే//

ఎంత డబ్బున్నా ఎంత పలుకుబడి ఉన్నా
ఆత్మీయంగా పలకరించే
ఒక్కమనిషి లేని వాడు
ఎన్ని సంపదలున్నా బిచ్చగాడే//

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!