మా ప్రేమకు సాక్షి

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

మా ప్రేమకు సాక్షి

రచన: సిరి.యం

కాలేజీ లో ఆ రోజు కోలాహలంగా ఉంది…. స్టూడెంట్స్ అందరూ లగేజీ లతో  బస్ లో ఎక్కుతూ ఉన్నారు … “అందరూ వచ్చారా ఇంకా ఎవరైనా రావాలి ”   అని అడిగేరు ప్రసన్న మేడమ్…

“అభి ,నయన రావాలి ” మేడమ్… ” కాల్ చేయండి ”  ” సరే మేడమ్” అని కాల్ చేసి ” ఎవరు లిప్ట్ చేయడం లేదు” అన్నారు….” సరే ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం  ” అన్నారు….

అందరూ మనసు లో  అభి త్వరగా రా అనుకుంటూ ఉన్నారు… ఎందుకంటే అభి లేకపోతే సందడే ఉండదు… అసలు ఈ టూర్ పెట్టిందే అభి….

అభి ధనవంతుల బిడ్డ … అభి ఎది కావాలన్నా చిటెకలో తెచ్చి ఇస్తారు..ఒక రోజు అభి కారు లో వెళ్తుంటే ఒక అమ్మాయి నీ చూస్తాడు… లంగా, ఓణీ వేసుకుని జడ చూస్తే నడుము దాకా ఉంది జడలో మల్లెలు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళుతూ ఉంటే అభి మొహం చూడాలని కారు నీ స్పీడ్ గా పోనిచ్చి ఒకచోట అపి దిగి తన కోసం చూస్తూ ఉంటే తను నెమ్మదిగా నడుచుకుంటూ వస్తూ ఉంది…

అభి తనని అలాగే చూస్తూ ఉన్నాడు … తను అభి నీ దాటి ముందుకు వెళ్ళింది… అభి గుండె మీద చెయ్యి వేసుకుని ఇంత అందంగా ఎలా పుట్టావే నా కోసమే పుట్టి ఉంటావు  అనుకొని  తన చేతులో బుక్స్ ఉంటే ఏ కాలేజీ నో చూద్దాం అని తన వెనుక పరిగెత్తేడు…

తను కాలేజీ లోపలి కి వెళ్ళడం చూశాడు…”ఓ.ఈ కాలేజీ  నా రేపు డాడీ తో చెప్పి ఈ కాలేజీ లో జాయిన్ అవ్వాలి ” అని అనుకొని ఇంటికి వెళ్ళి” తనకు ఫలానా కాలేజీ లో రేపు సీట్ కావాలి ” అని అడగాన్నే …. “ఎందకు అంతా చిన్న కాలేజీ నీకు కావాలంటే  ఇప్పుడు చదివే దానికన్నా పెద్ద కాలేజీ చదువు” అన్నారు వాళ్ళ డాడీ ….

అభి మొండి గా” నాకు  ఆ కాలేజీ లో సీట్ కావాలి అంతే అనగానే”  …. “సరే అభి ఆ కాలేజీ లోనే సీట్ వస్తుంది” అని వాళ్ళ మామ్ చెప్పేసరికి “నిజం గానా ” “నిజం అభి అని “అన్నం నోట్లో పెడుతుంటే తింటు ఉన్నాడు… వాళ్ళ డాడీ అప్పటికప్పుడు ఫోన్ చేసి సీటీ కావాలి అంటే… “ఓకే సార్” అన్నారు అవతల…..

తెల్లారేసరికి అభి కి ఆ కాలేజీ లో సీట్ వచ్చింది అని తెలిసి అభి హుషారు గా లేచి కాలేజీ కి వెళ్ళడానికి  రెడీ అయి కిందకు వచ్చి” మామ్ టిఫిన్ ” అనగానే ఆశ్చర్యంతో  “అభి నువ్వేనా కాలేజీ టైం అవుతుంది లే అన్నా లేవవు ఈ రోజు ఏమిటి” అన్నారు…

“మామ్ కొత్త కాలేజీ కదా”అని టిఫిన్ చేసి కాలేజీ వెళ్ళి తను ఏ క్లాసో ఏమిటో అనుకుంటూ క్లాస్ లో ఆడుగుపెట్టాగానే అందరూ అభి వైపు చూసి”ఏ క్లాస్” అంటే ” ఈక్లాసే కొత్త గా వచ్చాను ” అన్నాడు…

సరే అని ఒకళ్ళు జరిగి కూర్చో అన్నారు.. అభి కూర్చుని అందరీ నీ చూస్తూ ఉంటే అప్పుడే గజ్జేల సౌండ్ అయితే ఎవరా అని చూస్తే తను ఎవరి కోసం అయితే కాలేజీ లో జాయిన్ అయ్యాడో తనే వస్తూ ఉంది… అంటే తను ఈ క్లాసేనా అని మనసులో అనందపడుతూ ఉన్నాడు…

తను వచ్చి అభి కి వేరోక సైడ్  తన ఫ్రెండ్ సౌమ్య పక్కన కూర్చుని అభి నీ చూపించి “ఎవరు “అన్నది…. ” కొత్తగా వచ్చాడు” అన్నది…సార్ వచ్చేసరికి  కామ్ అయి క్లాస్ వింటూ ఉన్నారు…

అభి మాత్రం తన వైపు దొంగ చూపులు చూస్తూ తన పేరు ఏమిటో తెలియలేదే అని అనుకున్నాడో లేదో నయన అంటూ ఎవరో పిలిచారు….” నయన ఎంత బాగుంది పేరు మా ఇద్దరు పేర్లు కలిపి తే “అభినయన ” అని అనందపడ్డాడు….

ఇంక ఆ కాలేజీ లో ‌అభి కి చాలా ఫ్రెండ్స్ అయ్యారు…. అభి రోజు నయనను చూస్తేనే ఉన్నాడు  కానీ  తనతో ఒక్క మాట మాట్లాడడు ….తన మీద ప్రేమనంతా కళ్ళతోనే చూపిస్తూ ఉన్నాడు….

నయనకు అర్థం అయింది కానీ తన ఇంటి పరిస్థితి గుర్తుకు వచ్చి అభి కోటిశ్వరుడు ..తను పేద కుటుంబం లో పుట్టింది… ఇద్దరు కు సెట్ అవదు  అని అభి తన వైపు చూస్తున్నా ఏమి తెలియనట్టే ఉన్నది…

నయన కు అభి ని చూస్తే చాలు మనసు ఆనందం తో నిండి పోతుంది … ఇంటి కి వెళ్ళి రోజు అభి చేసి పనులు తలుచుకొని నిద్రపోవడం అలవాటు అయిపోయింది…

ఒకరోజు నయన తన ఫ్రెండ్ సౌమ్య తో “నాకు  తాజ్‌మహల్ చూడాలి అని  చిన్నపటి నుంచి   కోరిక  అది తీరుతుందో లేదో తెలియదు” అని చెప్పడం అభి విన్నాడు..

నయన కోసం ఆభి  వాళ్ళ డాడీ తో చెప్పి ఈ టూర్ ఏర్పాటు చేయించాడు…ఫస్ట్ నయన నాకు దగ్గర డబ్బులు లేవు రాను అన్నది అన్న విషయం సౌమ్య ద్వారా తెలుసుకున్న అభి సౌమ్య కు మనీ ఇచ్చి “నువ్వు దాచిన మనీ అని చెప్పి ఇవ్వు తన దగ్గర ఉన్నప్పుడు నెమ్మదిగా ఇవ్వమని చెప్పు “అన్నాడు…

సౌమ్య అభి చెప్పినట్లు చేసింది … చివరి కి సౌమ్య బ్రతిమలాడగా  ఒప్పుకుంది నయన ..ఇప్పుడే వెళ్ళేది ఆ టూర్ కే ….

బస్ దగ్గరకు ఆటో వచ్చి ఆగింది దానిలో నుంచి నయన దిగింది…నయన చూసిన ఫ్రెండ్స్ “నయన వచ్చింది మేడమ్ ఇంకా అభి రావాలి ” అనగానే అభి కారు వచ్చి ఆగింది… అభి కూడ వచ్చాడు అని అరిచారు…

నయన, అభి బస్ ఎక్కి నయన సౌమ్య పక్కన కూర్చోంది… అభి నయన వెనుక కూర్చోన్నాడు…”ఓకే స్టూడెంట్స్ అందరూ వచ్చారు గా స్టార్ట్  అవుదామా”అనగాన ” యస్ మేడమ్ ” అన్నారు అందరూ…

బస్ లో స్టూడెంట్స్ అందరూ సరదా సరదా అల్లరి చేస్తూ పాటలు పాడుతూ ఉంటే అభి కూడ వాళ్ళతో చేరి డాన్స్ చేస్తూ నయన వైపు చూశాడు…నయన తనని చూడటం చూసి హుషారు గా స్టూడెంట్స్ నీ ఎంకరేజ్ చేస్తూ బోర్ కొట్టకుండా చూసేడు… గర్ల్స్ అందరూ అభి తో చేరి డాన్స్ చేస్తూ ఉంటే “నయన కోపం గా సౌమ్య తో ఏమిటి పిచ్చి డ్యాన్స్ లు కూర్చోవచ్చు గా” అన్నది…

“నేను ఎక్కడ డాన్స్ చేశానే  నీ పక్కనే ఉన్నాను గా ” అన్నది… సౌమ్య మాటలకు అభి నవ్వుతూ వచ్చి “నిన్ను కాదులే “అన్నది … “ఎవరిని అన్నారో వాళ్ళకి అర్థం అయి వచ్చి కూర్చున్నారులే” అన్నాడు….

అలా సరదా సరదాగా ఆడుతూ పాడుతూ ఆగ్రా వచ్చేసరికి నైట్ అయింది… నవంబర్ నెల కాబట్టి కొంచెం చలిగా ఎక్కువ గా  ఉంది…

హోటల్ రూమ్ లో ముగ్గురు కి కలిపి  ఒక్కొక్క  రూమ్ తీసుకొని ఎవరి రూమ్ లోకి వాళ్ళు  వెళ్ళేరు… సౌమ్య నయన మాత్రమే ఉన్నారు…

” మేడమ్  మాకు ఇవ్వలేదు ” అన్నారు సారీ అమ్మ ఇక్కడ రూమ్స్ అయిపోయాయి అంటా అభి పక్కన హోటల్ ఉన్నాయి ఏమో అడిగి వస్తాను అని వెళ్ళాడు” అన్నది…

అభి వచ్చి “మేడమ్ ఉన్నాయి తీసుకున్నాను “అన్నాడు ‌…”ఓకే అభి జాగ్రత్త మార్నింగ్ సిక్స్ కి రండి” అని చెప్పి వెళ్ళేరు….

అభి “రండి” అనగానే లగేజ్ తీసుకుని అభి వెనుక వెళ్ళేరు…బయట వీళ్ళ కోసం కారు రెడీ గా ఉంది డ్రైవర్ వచ్చి లగేజ్ కారు లో పెట్టి రండి మేడమ్ అని కారు డోర్ తీసి పట్టుకున్నాడు… ఇద్దరు కారు లో కూర్చోగానే డోర్ వేసి కారు లో కూర్చోంటాడు… అభి డ్రైవర్ పక్కన కూర్చోని పద అనగానే కారు ముందు పోనిచ్చి ఒక పెద్ద హోటల్ ముందు ఆపేడు…

ఆ హోటల్ ని ఇద్దరు ఆశ్చర్యంతో చూస్తూ ఉంటే “రండి లోపలికి వెళ్దాం ”  అన్నాడు అభి …నయన  సౌమ్య తో” ఇంత పెద్ద హోటల్ కి డబ్బులు చాలా అవుతాయి వద్దు ” అన్నది….”నాకు అలానే అనిపిస్తుంది నయన” వీళ్ళ ఇద్దరి  మాటలు విని నవ్వుతూ “ఇది మా హోటలే భయపడకండి రండి”  అని లోపలికి తీసుకు వెళ్ళేడు…

ఒక రూమ్ లోకి  తీసుకొని వెళ్ళి ” ఈ రూమ్ మాదే  మేము ఎప్పుడు వచ్చినా  ఈ రూమ్లో నే ఉంటాం నేను పక్క రూమ్ లో ఉంటా రెడీ అవ్వండి బయటకు వెళ్దాం అని చెప్పి “వెళ్ళేడు…

ఇద్దరు రెడీ అయి అభి రూమ్ దగ్గరకు వెళ్ళి డోర్ కొట్టగానే తీశాడు… అభి ని చూడగానే ఆశ్చర్యం తో చూస్తూ ఉంది నయన ఎందుకంటే నయన వైట్ డ్రెస్ వేసుకుంది… అభి కూడ వైట్ కుర్తా వేసుకున్నాడు… సౌమ్య ఇద్దర్ని చూసి ఎంత అందంగా ఉన్నారో  అనుకొని “ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు అభి” అన్నది…

వెళ్తున్నాం గా చూద్దరు అని బయటకు వచ్చి కారు లో కూర్చోన్నారు  కారు వెళ్ళి ఒకచోట కి వెళ్ళగానే ఆగింది … అభి దిగి రండి అని లోపలికి తీసుకువెళ్ళేడు….

గెట్ దగ్గర టికెట్స్ ఇచ్చి లోపలికి వెళ్ళేరు…నయన కి సౌమ్య కి ఏమి అర్థం కాదు… లోపలికి వెళ్ళాగానే అర్ధం అయింది తాజమహల్ దగ్గరకు వచ్చాం అని అలా ఆశ్చర్యంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు…

అలా వెళ్ళగానే ఎదురు గా  వెన్నెల కాంతి లో ప్రేమకు చిహ్నం అయిన  పాలరాతి  తో కట్టిన   అందమైన తాజమహల్  చూడగానే నయన కు ఆనందం తో మాటలు రావు నెమ్మదిగా నడుచుకుంటూ తాజ్మహల్ దగ్గరకు వెళ్ళి తనివి తీరా చూస్తూ ఉంది….
అభి దగ్గర కు వెళ్ళి మొదటి సారి గా నయన తో మాట్లాడుతున్నా మాటలు…

నయన నేను నిన్ను మొదటిసారి చూసినప్పుడే నువ్వే నా ప్రాణం అని అర్థం అయింది నీ కోసం ఈ కాలేజీ లో జాయిన్ అయ్యాను … నీతో మాట్లాడదాం అంటే ఏమి మాట్లాడాలో తెలిసిదే కాదు‌.. కాలేజీ లో నిన్ను చూస్తూ నీ రూపాన్ని నా కళ్ళల్లో నింపుకుని ఇంటి కి వెళ్ళి నీతో ఉన్నా ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకుంటూ పడుకునే వాడ్ని…

షాజహాన్ లాగా నేను తాజమహల్ కట్టలేను గాని నిన్ను  జీవితాంతం ఎలాంటి కష్టం రాకుండా చూసుకోగలను అనే నమ్మకం ఉంది..నా ప్రేమ మీద నీకు నమ్మకం ఉంటే ప్రేమకు చిహ్నమైన ఈ తాజమహల్ సాక్షి గా నా ప్రేమ ను అంగీకరిస్తావు అని అనుకుంటున్నాను‌ అని రోజ్ ఫ్లవర్ పట్టుకొని  మొకాళ్ళ మీద కూర్చోని”  I love you” అని ఇచ్చాడు…

నయన ఆనందం తో ఉక్కిరిబిక్కిరి అవుతూ‌ ” అభి ” అని ప్రేమగా పిలిచే సరికి ఫస్ట్ టైం నయన అభి అని పిలిచింది ఆనందంతో చూస్తూ ఉంటే నయన కూర్చోని అభి చేతి లో ఫ్లవర్ తీసుకొని ” I love you to”  అభి అని అభి నీ కౌగిలించుకుంది…

సౌమ్య ఆనందం తో ఇద్దరినీ ఫోటో లు తీస్తూ ఉంది…

వెన్నెల్లో తాజమహల్ సాక్షి గా అభి నయన లు ఒకటైయ్యారు….

తను చిన్నప్పటి నుండి   చూడాలి అనుకున్నా తాజమహల్ నీ ఇలా వెన్నెల వెలుగులు లో తనని ప్రేమించేవాడితో కలిసి చూడటం తో తాజ్మహల్  ఇంకా ఎంతో  అందం గా కనిపించింది…

అలా ఆ  వెన్నెలలో తాజమహల్ ను తనివితీరా చూసుకొని మళ్ళీ మార్నింగ్ ఫ్రెండ్స్ తో ఆగ్రా మొత్తం తిరిగి తరువాత ఢీల్లీ వెళ్ళి రెండు రోజులు ఉండి return అయ్యారు…

ఒక ఫైవ్ ఇయర్స్  తరువాత  చిన్న పాప  తో  అభి నయన  వెన్నెల వెలుగులు లో తాజమహల్  నీ చూస్తూ ఉన్నారు…..

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!