ఒక బ్యాంకు బోర్డు తిప్పేస్తే..

ఒక బ్యాంకు బోర్డు తిప్పేస్తే..
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: సావిత్రి ప్రసాద్ గునుపూడి

ఒక గుండె ఆగినంత పని అయింది.
మరో గుండెకు ఆ అవకాశం కూడా లేదు
తాను మోసపోయానని తనవారితో చెప్పుకునే ధైర్యం కూడా చేయలేని స్థితి.
నెల తిరిగేసరికి వచ్చే వడ్డీ రాకపోతే మందులకు ఎలాగా అని ఆ వృద్ధ కాపోతాల దిగులు.
తన  ఈడొచ్చిన బుజ్జిగువ్వను కళ్యాణిగా చూడాలన్న ఓ పిచ్చి తండ్రి కలలు చిద్రo.
పిల్లల భవిష్యత్తుకు కట్టుకున్న గుజ్జనగూళ్ళు కోల్పోయిన ఓ జంట.
మధ్య తరగతి మనిషి ఆశల పల్లకి ఎక్కాలనే ఆశ కూడదని మరోసారి ఋజువైంది.
ఇంత ఉపద్రవం జరిగిన…
ఎవరు గుర్తించరేమిటి?
వృద్ధాప్యo లో కొడుకు అవుతుందనుకున్న సంస్థ చిరునామా గల్లంతయితే.
తండ్రిలా పిల్ల పెళ్ళికి సాయం అవుతుందనుకున్న..
బ్యాంకు బోర్డు తిప్పేస్తే
ఆకాశం బద్దలు కాలేదే..భూమి ముక్కలు కాలేదే..
అని అమాయకంగా ఎదురు చూశారు.
వారి పిచ్చి గాని,
ఎవరికి పడుతుంది వీరి రోదన.
ఎవరి ముడుపులు వారికి ముట్టాయని ఎవరూ మాట్లాడటం లేదా…లేక
వీరి బాధ మనకేమి ఉపయోగం లేదు అనుకున్నారా !
తపస్సు చేస్తే ప్రత్యక్షం అవ్వడానికి వారేమీ దేవుళ్ళు కారు కదా.
ఇంతమంది కొంపలార్పిన అస్మదీయులైన బోర్డు సభ్యులు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!