ఉచితాలు అభివృద్ధి పథాలా?

ఉచితాలు అభివృద్ధి పథాలా?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

ప్రజాకర్షణ పదవీకాంక్ష ధ్యేయం
రాజ్య పరిస్థితి రోజురోజుకీ హేయం
సత్తా ఉన్నవారికి పని కల్పించక
అనాలోచిత పథకాలు తెస్తూ
సోమరులను తయారు చేస్తూ
అవాంఛిత బిచ్చగాళ్లను చేస్తూ
దొరికిన కాటికి అప్పులు చేస్తూ
దోచుకోగా మిగిలినది ధారపోస్తూ
అభివృద్ధికి తెగులు పట్టిస్తూ
విద్య వైద్యం కొనలేని స్థితి తెస్తూ
మేధస్సును చేతులారా చంపేస్తూ
జీవనాలు అధోగతి పాలు చేస్తూ
ఏ తీరానికి చేరునో కదా!
ఈ తీరుగ పయనించే
ఘణ చరిత గల ఈ రాజ్యం!
మేధావులారా కదలండి
ఉచితాలకు స్వస్తి పలికేలా
ఉద్యమాలు నడపాలేమో?!

You May Also Like

4 thoughts on “ఉచితాలు అభివృద్ధి పథాలా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!