రాస్తూనే ఉంటాను
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శిరీష వూటూరి
అమ్మ మీద రాశాను
ఆనందం వేసింది
నాన్న మీద రాశాను
నవ్వులఝరి విరిసింది
గురువు మీద రాశాను
గౌరవం దక్కింది
చెట్టు మీద రాశాను
చిన్ననవ్వు నవ్వింది
పువ్వు మీద రాశాను
పరిమళం ఇచ్చింది
గాలి మీద రాశాను
చల్లగా వీచింది
కలం మీద రాశాను
కవితలా మారింది
తెలుగు మీద రాశాను
వెలుగులు విరజిమ్మింది
మనసులోని భావాలకు
మంచి మంచి రంగులద్ది
రాస్తూనే ఉంటాను,
విరబూస్తూనే ఉంటాను..