ఊహల ఉప్మా

ఊహల ఉప్మా

రచన: చంద్రకళ. దీకొండ

“అందమైన బావా… ఆవుపాల కోవా” పాటను ఆస్వాదిస్తూ ఊహాల్లో తేలిపోతున్న నాకు…
ఊహల ఉప్మా చెదిరి వాస్తవం మాడిన వంకాయ
బజ్జీ అయింది…!
ఈ యూట్యూబ్ వంటకాలేంటో
రోజుకో తీరు ప్రయోగాలేంటో
ఒక రోజు…
సరిగా వేగని బీరకాయ గారె
ఇంకో రోజు…
పనసకాయ పూరి
మరో రోజు…
మరీ అధ్వాన్నంగా…
కాకరకాయ కేకుట
ఏం చెప్పమంటారు
నా అవస్థలు
మీరెప్పుడైనా విన్నారా…? తిన్నారా…?!
రేగుపండు హల్వా
జామపండు జాంగ్రీ
అరటిపండు ఆవకాయ
పండు, కాయ, పువ్వు…
కాదేదీ ఆమె పాక
నైపుణ్యానికనర్హం…!
ఒకసారి నాకిష్టమంటూ…
పాయసం చేసింది
దేంతో అనుకున్నారు…?! పాకుండలతో
మర్చిపోయా…
మరువలేని రుచి అది…!
దొండకాయ దోశ…
రవ్వలెస్ ఇడ్లీ కూడా…
ఇంకా…
మీ ఆరోగ్యం కోసమంటూ…
చిరుధాన్యాలతోనూ
మొదలెట్టింది….
దేవుడా…!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!