వయ్యారి గాలిపటమా.. నీ పయనమెటు?

వయ్యారి గాలిపటమా.. నీ పయనమెటు?
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:  కందర్ప మూర్తి

వయ్యారి గాలి పటమా
రంగుల  చీర సింగారించుకుని
వగలు చూపుతుంటివా
రంగుల వలువలు నాకేనని  నీలుగా
నీలి  అంబరం  నాదేనని  ఆనందమా
పవనునితో  పరుగులాడు  చుంటివా
నింగిలో  పక్షులను చూసి  నవ్వులాటలా
అంబరమందున  ఆహ్లాదమా, ఆనందమా
ఆ గట్టునుంటావా  లేక   ఈ గట్టుకొస్తావా
ఈ మాంజా(దారం) లేకుంటే   నీ పయన మెటు
విధ్యుత్ తీగల నంటితివా గిజగిజ మంటావు
చెట్ల కొమ్మల  ముద్దాడితివా  మూతి వంకరపోతావు
అంబరాన  నీ వగలు చూసి  మురిసిపోదురు పిల్లగాళ్లు
డోరీలతో  నీ మాంజా  గొంతుక   కోస్త నంటరు
నీ జీవిత గమ్యం  ఈ పుడమేనని  మరచిపోకు
దిగు దిగు గాలిపటమా, దిగులేల నీకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!