నవలోకంలో నారి

అంశం::(“ఊహలు గుసగుసలాడే”)

నవలోకంలో నారి

రచన: చంద్రకళ. దీకొండ

గుసగుసలాడే ఊహలు
మదిలో సందడి చేయగ…
మగువ ఊగుతోంది
పూల ఊయల…!
మధువనిలో విరిసిన
పూల ఊయల…
ఊరించే అనుభూతులలో ఓలలాడిస్తోంది…!
కాలమిలా ఆగిపోనీ అనే
కోరికను కలిగిస్తూ…
మునుపెరగని నవలోకంలో విహరిస్తూ…
ఉయ్యాల జంపాలలూగుతోన్న
ఉవిద…!
పరవశం కలిగించే
ప్రకృతి తోటలో…
సుమసౌరభాలను ఆఘ్రాణిస్తూ…
కమ్మని తావి జోల పాడగా…
తీయని కలల తీవెలపైన…
హాయి ఊయాలలూగుతున్న మనసుతో…
నవలోకంలో విహరిస్తున్న నారి…!

***

You May Also Like

One thought on “నవలోకంలో నారి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!