నాకు దయ్యం అంటే భయం

అంశం: సస్పెన్స్

“నాకు దయ్యం అంటే భయం”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: యాంబాకం

ఒక తమాషా చెబుతా వినండి నే చెప్పేది వినండి! మా అక్కకు పెళ్ళి చేసి అత్తగారు ఇంటికి పంపుతున్నారు. అది నాకు తెలియదు అప్పుడు నా వయస్సు మూడో, నాలుగో, సంవత్సరాల వయస్సు ఉంటుంది. అప్పుడప్పడే కాస్త ఊహ వస్తాఉంది. అక్క బయలుదేరు తున్న సమయంలో మా అవ్వ, అమ్మ ఏడుస్తున్నారు. అక్క కూడ ఏడుస్తుంది. అక్కడ ఒక మగ అతను మాత్రం సంతోషంగా కనిపించాడు. అతనే బావ ఇది అంతా చూసి నాకు ఏడుపు వచ్చేసింది నేను అక్క తో ఊరికి వెళ్ళాలని నిశ్చయించు కొన్న నా మొండి పట్టు పట్టాను ఇంకే ముంది అమ్మ నా బట్టలు కూడా సంచిలో పెట్టింది. తరువాత ఒక ఊరిలో దిగాము రిక్షా ఎక్కి ఒక ఇంటి పోయాము అది చాలా మైదానం దాని పక్కనే తుప్పలు ఇంకా ఎదో గేటు లాంటి కనిపించింది. రిక్షా ఆ గేటు దాటి ఆ మైదినం పక్కనే ఆపి వెళ్ళి పోయాడు. ఆ తరువాత చాలా మంది అక్కడకు మాకు ఎదురు గా వచ్చి చాలా సంతోషంగా తీసుకెళ్లారు. అందులో ఒక అక్క పేరు వాణి నన్ను చాలా ఇష్టం గా పలకరించి తీసుకెళ్లింది.వాణి అక్క నాకు అంతా కొత్త గా ఉంది ఇంతలో వీడు ఎవడు అని ఒక పాప నాకంటే రెండు సంవత్సరాలు ఎక్కవే ఉంటుంది. దానికి బడాయి కాస్త ఎక్కువ చేస్తుంది. తను పేరు త్రిపుర. ఇంతలో వాణి అక్క త్రిపుర తో అలా అనకుడదు ఇతను మనకి తమ్ముడు అవుతాడు. ఊరు నుంచి ఇప్పుడే వచ్చాడు. ఇక్కడ ఉన్న రోజు నీవు ఇతని తో స్నేహం గా ఉండాలి అని పరిచయం చేసింది. అప్పటి నుండి త్రిపుర నాతో బాగా ఉంటుంది. కాకపోతే తనకు తెలియని అన్ని తెలుసు అని చెబుతుంది. తను కూడా మేము ఉండే ఇంట్లో నే ఉండేది. ఇద్దరం కలసి రోజు వరండాలో గడిపేవాళ్లం మాతో కూడ మామ కూడ ఉండేవాడు. త్రిపుర నాకు చాలా దగ్గర స్నహం చేయసాగింది. నా తో భోజనం చేయడం బయట వరండాలో కూర్చుని కథలు చెప్పమని మామ ను అడి రోజు రెండు మూడు కథలు వినేవాళ్ళం మామ హుషారుగా వుంటే రోజు కు రెండు మూడు కథలు చెప్పేవాడు లేదంటే ఒక కథ తో ముగించేవాడు. మేము కథ చెబితే చాలు అనుకునే వాళ్లం మేము ఇద్దరం ఒకసారి కర్మ చాలక ఒకకథ విన్నాము. ఆ కథలో ఒక దయ్యం రాత్రి పూట వచ్చి మనుషులను ఎత్తు కుపోతుందని తెల్లవారే సరికి ఆ మనుషుల ను ఎక్కడో ఒక దగ్గర ఉదలి పోతుందని కొంత మంది దాని తోడు కూర్చుని ఏడుస్తారని తరువాత వాళ్ళ వాళ్ళు వచ్చి వారిని తీసుకెళ్ళతారని, మర్నాడు ఆ మనుషుల ను మళ్ళీ దయ్యం ఎత్తుకెళ్ళి తుందని వదులుతుందని ఇట్లా ఎన్ని సార్లో చేసిందట. ఆ కథ మేము ఇద్దరం విన్నం త్రిపుర నా కంటే పెద్దది కాబట్టి భయపడినట్లు కనపడలేదు కానీ నేను మాత్రం ఆ కథ విన్నది మొదలు నా నీడ చూచుకొని దయ్యం అని ఊహించుకొని ఏక్కడకు వెళ్ళి నా వెంట దయ్యం మే అనుకని ఒంటరిగా ఎక్కడ కు పోయేవాడను కాదు.
ఒకరోజు రాత్రి వేళ పెద్దగా రాత్రి కాదు దాహం ఐతే లోపలికి వెళ్ళి వంటగది లోని బిందే లో నీళ్ళు కొరకు పోగా అక్కడ ఎదో ఒక ఆకారం చీకటిలో నల్లగా నిలుచుని ఉన్నట్లు గా కనిపించింది. నేను దాహం ఏమోగాని ఆ దయ్యం ఎక్కడో లేదు ఇదిగో వంటగదిలోనే ఉంది అని నీళ్ళు తాగ కుండానే పరుగున వచ్చి త్రిపురతో చెప్పాను. అది నవ్వుతూ “ఐతే నీకు దయ్యం అంటే భయమా”అని పగలుబడి నవ్వుతూ అడిగింది. అవునన్న…. అది మొదలు త్రిపుర మామ దగ్గర చాల దయ్యాల కథలు చెప్పమనేది. నాకు దయ్యం మంటే రోజు రోజుకు భయం ఎక్కవైంది. త్రిపురకు ఎవరన్నా భయపడుతుంటే చూసి సరదపడటం అంటే ఏదో సామేత చెబుతారు, “పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం ” అన్నట్టు, ఈ దయ్యాలు విషయం వినప్పటి నుంచి నేను ఒంటరిగా పడుకో లేక వాణి అక్కతో పడ కుంటున్నా. అది చూసి త్రిపుర నేను భయపడుతున్నాని తెలిసి ఇంకా ఏడిపించేది. అదుగో దయ్యం ఇదిగో దయ్యం అని పైగా బడాయిలు కొడుతూ ఉండేది. ఒకసారి త్రిపురకి దయ్యం కనిపించిందంట మాట్లాడిందంట కూడ దయ్యం త్రిపురని భయపడి పారి పోయిందంట. “మళ్ళీ ఇటువైపు వస్తే నీ సంగతి తేలుస్తా అని హెచ్చరిక చెసిందంట అని కూడా చెప్పిందింట త్రిపుర అప్పుడు చెప్పేవన్ని కూడ నిజమే అనుకొనేవాన్ని. పైగా మా బడిలో కూడ దయ్యాలు ఉన్నాయని చెప్పేవాడు. కానీ పగలురావట రాత్రి పూట కనిపిస్తాయట అని చెప్పేవారు. నయమే ఆ దయ్యాలు పగలు గా వస్తే బడికి మానేసే వాన్ని అసలు త్రిపురని చూస్తే దయ్యనికి భయం కదా!త్రిపుర దగ్గర ఉంటే దయ్యాలు రావు అనుకోని నేనెప్పడూ త్రిపుర వెంట దానినీడలాగ తిరుగుతూ ఉండేవా‌న్ని ఈ అలుసు తీసుకొని అది నా చేత అడ్డమైన పనుచేయించుకొనేది. ఇంట్లో బయట పనులు నాకు చెప్పి తను రాణి లా చదువు కొంటూ కూర్చునేది. ఈ సంగతి మా వాళ్ళకు తెలిస్తే కొడతారు. కానీ త్రిపురతో దెబ్బలాడితే దయ్యాలని నాపైకి వదలేస్తే అందు చేత ఈ సంగతులు ఎవరికి చెప్పకుండ త్రిపుర తో స్నేహం గానే ఉంటుంన్నా.
ఒకసారి త్రిపుర అడిగింది “నీకు దయ్యం అరుపు వినాలని వుందా”అని ఆ మాట వినేసరికే నాకు గుండె ఆగిపోయినంత పని జరిగింది. “నాకుభయం”అన్నాను ఛా, ఛా అది అది దూరం నుంచి అరుస్తుంది. అన్నది. నాకేమో మనసులో ఒక పక్క దయ్యం అరిచేది వినాలని. కాని ధైర్యం చాలక, కొంత సేపు తర్వాత నేను భయపడుతానేమో ఎప్పుడు అరుస్తుందని అడిగి! “రాత్రి సరిగ్గా రెండు గంటల మధ్య అరుస్తుంది. కాస్త భయంగానే ఉంటుంది. దాని అరుపు మన ఇంటి వెనకాలవున్న మైదానంలోనే అరుస్తుంటుంది రోజూ అనిచెప్పింది. ఆ మాటవిని నేను బంబేలు పడ్డాను. హడలి పోకు నేను ఉన్నాను అంది త్రిపుర. “రాత్రి రెండు గంటల కెల్లా మెళుకువ వస్తుంది”అన్న నేను లేపుతాలే అంది త్రిపుర ఆ రాత్రి కి అన్నం కూడా సగిలేదు. భయం ఎక్కువ అయింది.వాణి అక్క తో కానీ అక్కడ ఉన్న పెద్ద లకు కానీ చెబుదామా అనుకున్నా కానీ. త్రిపుర కి ఒట్టు వేశాను.అది చెప్పిన మాట ఎవరితో చెప్పనని ఎట్లా రాత్రి పూట కళ్ళు గట్టిగా మూసుకొన్నా నిద్రరావడంలేదు. వాణి అక్కకు కౌగిలించుకొని పడకొన్నా. త్రిపుర నేను భయపడటం చూసి “ఇప్పడే ఎందుకు అంత భయం ‌దయ్యం అరిచేది రాత్రి రెండు గంటలకుకు నీవు నిద్రపో నేను లేపుతాను” అంది నేన నిద్రపోయ్యాను.
రాత్రి సరిగ్గా రెండు గంటలకు త్రిపుర నన్ను తట్టి లేచింది. నేను చెవులు నిక్కిరించి విన్న అబ్బ! గుండెలదిరి పోయేలా అరుపు అంతనిశ్సబ్ధంగా ఉండే సమయంలో ఆ అరుపు చాలా భయంకరంగా వుంది త్రిపుర నిజంగా చాలా ధైర్యస్థురాలు లేకపోతే అది భయం లేకుండా ఎలా వింటుంది? నేను గజ గజ వనికి పోతూ కూర్చన్న దయ్యం అరవడం వినిపించింది. కానీ నాకు దాని నోరు ఎంత పెద్దది అయి ఉంటుందో అంత గట్టిగా అరవడానికి! దాని ఆకారం ఎంత వుంటుందో అదేం బట్టలు వేసుకుంటుందో ఇవన్నీ ఆలోచిస్తూ నేను త్రిపుర వంకచూసాను. అది నవ్వుతూ సరే ఇక పడుకోమంది. నేను కళ్ళు తెరిచే పడకున్న. తెల్లవారి న తరవాత రాత్రి జరిగింది అది కలలా అనిపించింది. త్రిపుర అడిగితే “నిజమే రాత్రి దయ్యం అరచి నప్పుడు నిన్ను లేపాను. నువ్వు భయపడ్డావు. అని చెప్పింది. దయ్యం అలా అర్థరాత్రి ఎందుకు అరుస్తుంది. కను‌‌క్కోవాలని నాకు అని పించింది. అది చెప్పేవాడు. మా మామ ఒక్కడే త్రిపుర సరిగా చెప్పదు. త్రిపుర కు తెలియ కుండా మామ ను అడగాలి అనుకున్నా. సాయంత్రం మామ కనపడగా అడిగాను మామ విరగబడి నవ్వుతూ “పిచ్చి బాబు నిన్ను భయపెట్టాలని చెప్పి ఉంటుంది త్రిపుర. రాత్రి నీవు విన్నది ” రైలు కూత” అది పతి రోజు అర్థరాత్రి వస్తుంది. అందులో ఎక్కే వారు దిగే వారు ఉంటారు. రాత్రి రెండు గంటలకు రోజు ఇటు పోతుంది. దాని కూత అది మొదట్లో త్రిపుర నీలాగే భయ పడింది. దానికి ఎవరో పిల్లచెప్పిందట దయ్యం అరుస్తుంది. అని ఒక సమయంలో అని ఒకరోజు రాత్రి సరిగ్గా అదే సమయానికి రైలుకూత వేసింది. త్రిపుర మంచం వదలిఆపరుగెత్తు కు వచ్చి నన్ను కౌగిలించుకుంది. నేను నిద్రలో ఉలిక్కిపడి “ఏమిటే”అంటే దయ్యం అరుస్తుంది. నేను విన్నాను అదిరైలుకూతే అని చెప్పిభయం పోగొట్టాను. మళ్ళినీకు చెప్పింది. ఆ త్రిపుర. ఒస్! ఇంతేనొి!!తిపురకి నాకంటే భయమని తెలిసింది. త్రిపుర చెప్పన వన్ని మామ తో చెప్పాను అవన్నీ పచ్చి అబద్దాలు నమ్మవద్దని చెప్పాడు. అది మొదలు త్రిపుర ఏదిచెప్పినా వినేవాడినికాను. అయితే దయ్యం అంటే నాకు ఇప్పటికీ భయమే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!