జీవన్ముక్తికి సోపానం

జీవన్ముక్తికి సోపానం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: అయ్యలసోమయాజుల ప్రసాద్

రామనామం రమణీయం
సర్వపాప వినాశనం.
శ్రీరామ తారకమంత్రం సకలజన శుభప్రదం.
‘శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే’
అని ముమ్మారు పఠిస్తే
సృష్టి, స్థితి, లయ కర్తలయిన త్రిమూర్తుల అనుగ్రహం లభిస్తుంది.
మోక్షదాయ ప్రదాయకం….!!
“రామో విగ్రహవాన్ ధర్మః”
ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు.
కులమత భేదాలు లేవని
గుహుని, శబరిని, జటాయువుని, ఆంజనేయుని,
అహల్యని, అల్పప్రాణి ఉడుతని ఉద్ధరించిన శ్రీరాముని గాధ
శ్రీమద్రామాయణం
మతసామరస్యానికే  ప్రతీక..!!
“ధర్మో రక్షతి రక్షితః”అన్నది
జీవితాన ఆచరించిన శ్రీరాముడు ప్రపంచానికే ఆదర్శం.
రాముని పాలన సుపరిపాలన
రామరాజ్యం ధర్మరాజ్యం
అందుకే రామాయణ మహాకావ్యం ప్రపంచానికే ఆదర్శం.
త్యాగయ్య, అన్నమయ్య, మొల్ల భక్తజయదేవ్, సక్కుబాయ్
రామదాసు వంటి ఎందరో మహానుభావులు
శ్రీరాముని అనుగ్రహముతో ముముక్షత్వంనొందారు
కావున రామనామం
జీవన్ముక్తి కి సోపానం…!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!