అర్ధరాత్రి

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

అర్ధరాత్రి

రచయిత :: మోదేపల్లి. శీనమ్మ

“అర్ధరాత్రి ఒంటి గంట”…ఏవో…అరుపులు… తేజ మంచి నిద్రలో నుండి చటుక్కున లేచాడు.
ఎవరివో.. ఏడుపులు.. “హూ… హూ.. హుహు…హూ… “అంటూ ఒక గొంతు.
“ఊ… హుహు..ఊ… మి… యా…మ్.. హుహు ” అంటూ ఇంకో గొంతు.
“అమ్మో…”ఎవరో చిన్నపిల్లలు ఏడుస్తున్నట్లున్నారు. ఏమైంది? ….ఎక్కడో ఇక్కడకు దగ్గర్లోనే… ఏడుస్తున్నారు! అని గబుక్కున లేచి లైటు వేసాడు తేజ.
వెoటనే “బీరువాకు ఉన్న అద్దంలోనుండి ఓ ఆకారం…
తనకెదురుగా”…కనపడింది.
“అమ్మో…”అని ఒక్క ఉదుటున మళ్ళీ మంచం పైకి దూకాడు.
ఒక్క సెకన్ ఆలోచించి, అరే… అది నా ముఖమే కదా!…ఏంటి నా ముఖంపై… ఆ గీతలు, అని ..
అబ్బా…ఈ “టింకు” గాడి పని అయ్యి ఉంటుంది ఇది.
అక్క కొడుకు ఐదు సంవత్సరాల బుడతడు ..”టింకు”
నేను నిద్రపోయే సమయంలో ఇలా చేసి నన్ను భయపెట్టావా ?..టింకు… చెప్తా! నీ పని అనుకుoటూ ఉండగా…
మళ్ళీ…క్షణాల్లో…”టెంక్షన్”
అమ్మో…ఆ ఏడ్చే గొంతుల్లో ఒకటి టింకు గాడిది కాదు కదా!
అని కంగారుగా… పక్కనే ఉన్న టవల్ తో తుడుచుకోకుండానే టవల్ భుజంపై వేసుకుని హాలులోకి పరిగెత్తాడు…
అక్కడ పడుకున్న తేజ వాళ్ళ నాన్న లేడు.
ఏమైందో ఏమో అని హాలు డోర్ తీసి
బయటకు నడిచాడు.
ఏడుపులు వినిపిస్తున్నాయి.
కానీ ఎక్కడి నుండి?…
“ఒక్క సెకన్”….ఆగాడు.
అక్క రూములో టిoకు ఉన్నాడా అసలు…చూడాలి.
అనుకుంటూ వెళ్లబోయి, నాన్న ఇక్కడ లేడు అంటే ..అక్కడ ఏం జరిగిందో…ముందు వెళ్లి చూడాలి అనుకుని…
“ఇంతకీ…అమ్మ ఉందా రూములో” ఏంటి ఈ వింత ఏడుపులు? అనుకుంటూ… ఉండగా…చీకటిలో…ప్రహరీ అవతల ఎవరో….గబ గబా పరుగు పెట్టినట్టు అనిపించింది.
వెంటనే మళ్ళీ ఏడుపులు.
“మూ…ఊ… ఉహూ…మి… యా ..మ్…హుహూ”
అంటూ…మళ్ళీ ఏడుపులు….
ప్రహరీ అవతల ఒక్క మూర స్థలం వదిలారు, వాస్తుకు మంచిది కాదని, అవతల వేరే వాళ్ళ ప్రహరీ ఉంది.
అంత కొంచం స్థలంలో ఎవరుంటారు.?
ఇవి “మనుషుల ఏడుపులానే “…”అలా దెయ్యాలు కూడా ఏడుస్తాయి కదా!”
దెయ్యాలేనా…అనుకుంటూ ..ముఖంపై చేత్తో తుడుచుకుని చెయ్యి చూసుకున్నాడు.
చెయ్యంతా ఎర్రగా ఉంది. “అమ్మో…రక్తం” ఏంటిది అనుకుని, ఒక్క సారి గుండె ఆగినంత పనయ్యింది తేజకి.
ఒక్క సెకన్ ఆలోచించి మెడ పై చెయ్యి పెట్టుకున్నాడు.
“చెమట తో ఒళ్ళంతా తడిచి స్నానం చేసినట్లే ఉంది.”
అప్పుడర్ధ మయ్యింది తేజకు…
“అది రక్తం కాదు, ముఖానికి ఉన్న కలర్” ఇలా అయ్యిందని.
హమ్మయ్య…అనుకుని భుజంపై ఉన్న టవల్ తో తుడుచుకున్నాడు.
మరి ఈ ఏడుపుల సంగతి ఏంటి? దెయ్యాలేనా? అని ముందుకు వెళ్లి చూద్దామా!…అని ముందుకు పోబోతుంటే…
“మెల్లగా భుజంపై ఎవరో చెయ్యి వేశారు.”
“ఏ…య్…అంటూ…ఒక్కసారిగా ఎగిరిపడ్డాడు తేజ.”
“ఎంటిరా? …ఇక్కడున్నావు ?”
అన్న మాటతో ఈ లోకంలోకి వచ్చాడు తేజ.
“వచ్చింది… తేజ వాళ్ళ నాన్న”.
“నాన్నా…నువ్వా…”
అక్కడ…అక్కడ…ఎవరో…ఏడుస్తున్నారు..అన్నాడు భయపడుతూనే…
“చిన్న పిల్లలు లాగే ఉంది, దెయ్యలేమో” అనిపిస్తుంది
అదా… “పిల్లలూ కాదు, దెయ్యాలు కాదు లేరా” అవి.
“మరి …ఇంకేంటి ఆ …ఏడుపులు…?”
“అవి…పిల్లులు రా…అలానే ఏడుస్తాయి అప్పుడప్పుడు.”
పిల్లులా… “అయ్యో…రామా… ఇంత భయపడ్డానే…
అనుకుంటూ…ఇంట్లోకి వస్తూ…అడిగాడు తేజ.
“నాన్నా…ఇంతకు ముందు నువ్వు మంచంపై లేవు ఎక్కడికెళ్లావు?” అని.
అదా… బాత్ రూమ్ కి వెళ్ళా తేజ అన్నాడు.

సమాప్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!