మామా ఆగు

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

మామా ఆగు

రచయిత :: అమృతపూడి రేవతి

పెద్దకంచర్ల గ్రామం లో నాగయ్య అనే రైతు ఉన్నాడు అతనికి 2 ఎకరాల మాగాణి ఉంది . పొలాన్ని దున్ని సాగు చేసుకొని బ్రతికే వాడు. పిల్లలు పుట్టలేదు . భార్య , నాగయ్య ఇద్దరు కష్ట పడి పని చేసుకునేవాళ్ళు.
నవంబర్ నెలలో పంట చేతికి వచ్చింది.వరికోసి కుప్పలు వేసారు అవి కళ్ళం చేసి బస్తాలు ఎడ్లబండిమీద తీసుకొని వెళ్తాడు. వకరోజు 50 కేజిల బస్తా నెత్తి న పెట్టుకుని బాగా చీకటిలో 2 కి లోమీటర్ల దూరం నడచి వెళ్తున్నాడు నాగయ్య , శవాలను కాల్చే చోటు మీదుగారావాలి నాగయ్య కటిక చీకటిలో బరువు తో నడుస్తున్నాడు కాష్టం దరిదాపుల కు వచ్చాడు .
వెనుక ఎవరో నడుస్తున్న శబ్దం వినిపించింది, ఎవరో లే అను కుంటూ నడుస్తున్నాడు నాగయ్య. నాగయ్యకు దెయ్యాలు అంటే భయ్యం,

వెనక వచ్చే స్త్రీ నాగయ్యను పిలిచింది ఓ…మామ ఆగు నేను వస్తున్నా అన్నది, నీ ఎర్రి గాలా బరువు ఉంటే ఎక్కడ నిలబడాలి రా నడువు నాతో అన్నాడు నాగయ్య . ఉండు మామ
నడవ లేక పోతున్నాను మామ ఆగూ… , నేను నిలబడను వస్తే రా లేకపోతే లేదు అని హుషారుగా వెళ్లి పోతున్నాడు (నాగయ్యకు 50 సంవత్సరాలు . పాత కాలం గనుక
50 కేజీలు మోస్తున్నాడు.)
మామా ఆగమన్నా ఆగవేంటి? అంటూ ముళ్ళ పొదలలో నడుచు కుంటూ వెళ్తుంది ఆ స్త్రీ .
అప్పుడు అర్ధమయ్యింది అది దెయ్యం అని తలమీద బరువు
ఎక్కువ ఐనది భారంగా అడుగులు వేస్తు ఇంటికి చేరుకున్నాడు నాగయ్య, ఇంటికి వెళ్లి బస్తా విసిరి క్రింద వేసి మంచం మీద అలానే కూర్చొని ఆయాస పడుతున్నాడునాగయ్య.

ఏమైంది అయ్యా అలాఉన్నావు అంటే

దెయ్యం నావెంట పడ్డది నేను వెనక్కి తిరిగి ఉంటే నాబ్రతుకు వేరుగా ఉండేదిఅంటూ భయపడ్డాడు నాగయ్య . అప్పటి నుండి ఏ రోజు వంటరిగా చీకటిలో రాడు అందరితో కలిసి వచ్చే వాడు.

ధైర్యంగా ఉంటే ఏది ఏమీ చెయ్యదు. ధైర్యమే సాహసం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!