అత్యాశ

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

అత్యాశ

రచయిత :: ధనాశి ఉషారాణి

ధనకొండ ప్రాంతములో ఓ చిరు ఉద్యోగి వుండేవాడు.అతను చిన్నతనములోనే ప్రేమించి పెళ్లి చేసుకోవడముతో బాధ్యతలు చుట్టిముట్టినాయి.భార్య చదువుకోకపోయినా కష్టపడి వ్యవసాయం చేసేది .గయ్యాలి అత్త గౌరమ్మ ఎప్పుడు చిత్రహింసలకు గురిచేసేది. రాము వచ్చే మూడువందల రూపాయిలతో కుటుంబం గడవడము కూడా కష్టమైపోయింది.ముగ్గురు పిల్లలతో చిన్న గుడిసెలో ఉన్నoతలో తింటూ హాయిగా బ్రతుకుతూ ఉండేవారు.ఐతే చేస్తున్న వృత్తికి న్యాయము చేస్తూనే కుటుంబ అవసరాలు నిమిత్తం అప్పులు చేయడము మొదలు పెట్టాడు రాము.ఉన్న కొద్ది పొలము గుట్టలు రాళ్లతో నిండి ఉన్నందున మితిమీరి పొలాన్ని చదునుచేస్తూ వ్యవసాయం కష్టపడి చేస్తూ పూరిగుడిసే నుండి మిద్దె ఇల్లును కట్టుకున్నారు .ఐతే పిల్లలు పైచదువు కోసము బయట ప్రైవేటు స్కూల్లో చేర్చాడు రాము.

ఉన్నత వర్గాలు ముందు ఓ స్థాయిని నిలుపుకోని ముందుకు సాగుతూనే ఊరిలో కూడా పెద్దరికముగా ఉంటూనే పక్క ఊరి రైతు వద్ద ఇంకో కొంచెము పొలమును కొనుక్కోవడము
జరిగింది.దానిని బాగు చేయడము కోసము వేలు వేలు డబ్బులు ఖర్చుచేసి గుట్టలను కూడా జేసీపీతో పిండిచేసి భూమిని ఏర్పరుచుకుoటూ మామిడి పంటను సాగు జేస్తూ నీటి వసతి కోసము అనేక బోర్లు వేసి లక్షలు లక్షలు అప్పులు పెరిగిపోవ సాగాయి.ఇక కొడుకు పైచదువులు కోసము లక్షలు కట్టి ఇంజనీయర్ని చేసే ప్రయత్నంలో అప్పులు
మితిమీరి పోయాయి.కానీ బాధ్యత తెలియని కొడుకు మాత్రము విలాసాలతో దుబారా చేయసాగాడు.ఇది గమనించని తండ్రి లక్షలు పంపడమే తెలుసు గానీ.కొడుకు అసలు రంగును కనుక్కోలేకపోయాడు.

ఇక ఉన్న ఒక్కకూతురుని దగ్గర బంధువులకు ఇచ్చి పెళ్లి చేశాడురాము.ఐతే ఏ రోజు కూతురి బాధ్యతల్ని తండ్రిగా గుర్తించలేదు.అవసరాల బోనులో ఒక్క బలిపశువులా కూతురి వద్ద అందింది లాక్కుoటూ తన కుంటుబ అవరాలను తీర్చుకో సాగాడు.ఐతే కుతురికి తలదాచుకివడానికి ఓ గూడు కట్టిఇవ్వాలనే ఆలోచన లేకపోగా.అప్పులు ఉన్నాయి అవి తీర్చేయండి.తరువాత అన్నీ సమకూర్చి ఇస్తాను అని చెప్ప సాగాడు కూతురికి.ఐతే కాలము గడిచిపోయింది గానీ కూతురికి ఏమియును చేయకపోగా సంతానం కలగడముతో కొన్ని మనస్పర్థలు వలన కూతురు వేరుకాపరము పెట్టుకోని బ్రతకసాగింది.ఐతే పిల్లల చదువుకోసము పట్టణముకు వెళ్లి ఓ మూడు అంతస్తుల భవనంను కట్టుట ప్రారంభించిoది కూతురు.ఇది జీర్ణించుకోలేక పోయిన తండ్రి రాము.ఆవేశముతో ఊగిపోయాడు మీరు అంతస్థుల్లో ఉంటే మీము చిన్న ఇంట్లో ఉండేదా అంటూ కొడుకి మనస్సులోకి రోషo నూరిపోసాడు.అంతే
గుట్టలుగా ఉన్న అప్పులును గమనించక.ఇంద్రభవనము లాంటి ఇల్లును కల్లు జిగేలు మనేలా హుటాహుటిన కట్టేసాడు రాము.

వెనక్కి తిరిగిచూసుకుoటే ఇంక ఏమి మిగలలేదు.సగటి జీవితాలు చితికిపోయాయి కొడుకు త్రిశంకస్వర్గములో ఊరేగుతూ పచ్చనోటు విలువ తెలుసుకోలేక విలాసాలతో మితిమీరిన ఖర్చులు చేసినా ఎక్కడ చూసినా అప్పులు గుట్టలుగా పేరుకుపోయాయి అప్పులు లక్షలు నుండి కోట్లల్లోకి అప్పులు చేరుకున్నాయి.అందని ఆకాశానికి నిచ్చెన వేశామని తెలిసినా కన్నీళ్లు మాత్రము మిగిలాయి .సమాజములో పరువు పోయి జీవచ్చావాలుగా మిగిలాడు రాము.కూతురు ఐనా కొడుకు ఐనా వివక్ష చూపకూడదని.డబ్బుతో చెలగాటము ప్రాణము మీదికి తెచ్చి పెడుతుందని రాము గ్రహించాడు. మితిమీరిన ఆశలు మనిషికి కన్నీరును మిగిల్చినాయని తెలుసుకునే లోపు బతుకులోన చీకటి మిగిలింది.ఉన్నంతలో బతకడమే నిజమైన జీవిత పరమార్థం అని తెలుసుకోని కన్నీరు పెట్టుకన్నాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!