ఒకరిని ఒకరు

(అంశం:”ప్రేమ/సరసం)

ఒకరిని ఒకరు

రచన: యాంబాకం

లక్కీనగర్ నిజంగా నే అక్కడ నివసించే వారికి లక్కీ అనే చెప్పాలి లక్కీనగర్ లో ఆరు వీధిలు ఉన్నాయి. లక్కీనగర్ లో 2వ.వీధిలో గోపాలం అనే గవర్నమెంట్ ఉద్యోగి కాపురం ఉన్నాడు. అతని భార్య సిరి తను కూడ గవర్నమెంట్ ఉద్యోగి ఇక వాళ్ల కి ఇద్దరు పిల్లలు కొడుకు కూతురు ఇద్దరి ని బాగ చదివిస్తున్నారు. గోపాలం సిరి దంపతులు ఇద్దరూ జాబ్ చేస్తున్నారు ఇద్దరూ బిజీ ఇద్దరూ కలసి కట్టుగా పని చేసుకొంటేగాని ఇద్దరూ టైమ్ కి ఆఫీసు కు పోలేరు గాక పోలేమని వాళ్ళకీ తెలుసు వాళ్ళు ఇద్దరూ ప్రేమ అనే పదానికి పర్యాయపదం అండి ఆఫీసు కు పోయే ముందు పనులు పంచుకొనే దాని లో “ఒకరిని ఒకరు” గిల్లికజాలే గిల్లికజ అది చూస్తే నే గాని ఏవరికి అర్దం కాదు. వంట పని కావచ్చు బయట పని కావచ్చు.ఆక్షణమే.తరువాత ఆఫీసు నుంచి తిరిగి వచ్చాక “ఒకరిని ఒకరు”లవ్వేలవ్”ఇది వారి వారం వారం దినచర్య ఇలా అందంగా అన్యోనం గా సాగుతున్నా వీరి ఆనంద సరసమైన ప్రేమ ఎలా మొదలైందో చూడండి.
అప్పుడు గోపాలం డిగ్రీ 4వ.సంవత్సరం కె జి యస్ కాలేజీ రోజుల్లో గోపాలం నెంబర్ వన్ స్టూడెంట్స్ అందరూ గోపాలం చుట్టూ తరిగు తూ ఉంటారు గోపాలం, శ్రీను చంద్ర ,బాబు ఈ నలుగురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ బాబు ఇంటికి గోపాలం ఇల్లు పక్క వీధి లో నే ఉంటాయి అందుకే వాళ్ళు ఇంకా క్లోజ్ గా ఉంటారు. ఒక రోజు గోపాలం బాబు వాళ్ళ ఇంటికి పోయాడు అప్పుడే గోపాలం సిరి ని చూసాడు. సిరి బాబు వాళ్ళ ఎదురింటి అమ్మాయి, బాబు వాళ్ల ఇంటికి వస్తూ పోతూ ఉంటుంది. ఒకరోజు గోపాలం మాటల సందర్భంలో బాబు ని సిరి వివరాలు వినగా తను మన కాలేజీ లో నే ఇంటర్ 2nd ఇయర్ అని తను కూడ గోపాలం లాగే నెంబర్ వన్ స్టూడెంట్ అని ఎమైన బయట పనులు ఉంటే బాబు వాళ్ల ఇంటికి వస్తూ ఉంటాదని చెప్పగా ఇక అప్పటి నుంచి గోపాలం కి సిరిని కాలేజీలో పలకరించాలని కలవరిస్తూ కళ కంటూ ఉన్నాడు.
ఈరోజు సాయంత్రం సిరిని కలవాలను కొన్నాడు గోపాలం చంద్ర ని శ్రీను ని బాబు ని రమ్మని చెప్పాడు నలుగురు అందరూ కాలేజ్ బయట గ్రౌండ్ లో ఉండగా సిరి గ్రౌండ్ వైపు వచ్చి బాబు ను చూసి పరిచయస్తుడే కదా! వచ్చి విష్ చేసింది. సిరి ని బాబు అందరికీ పరిచయం చేసాడు.అప్పుడే గోపాలం సీరి ని దగ్గర గా చూశాడు. అప్పటి నుంచి గోపాలం సిరి ని బాబు కు తెలియ కుండానే కాలేజ్ లో ఇంట బయట ఐస్ క్రీమ్ ఫ్యార్లర్ కూడ ఇద్దరూ ఏకాంతం గా పోయి “ఒకరిని ఒకరు”అర్దం చేసుకొనే దేశ గా ప్రేమలో పడ్డారు. ఇంతలో గోపాలం డిగ్రీ పూర్తి చేయగా సిరి 1st ఇయర్ కు వచ్చింది.
గోపాలం అది ఇది టెస్టులు రాసి గవర్నమెంట్ ఉద్యోగం లో జాయిన్ అయినాడు. అప్పటి నుండి సిరి కోసం గోపాలం కాలేజీ చుట్టూ తిరుగుతూ నే ఉన్నాడు గోపాలం ఉద్యోగం రాగానే బండి కొన్నాడు బండి మీద సిరి ని ఎక్కంచుకొని తిరిగేవాళ్ళు ఎవరికి తెలియకుండా సినిమా లు పార్కులో,ఇలా బైక్ లో ప్రేమ సరసాలలో తెలిపోతూ చిన్న చిన్న ముద్దులతో ఇలా తీయని గురుతులు తో సాగుతుంది ప్రేమాయణం సాగించారు. ఈసంగతి గోపాలం మిగతా ఫ్రండ్స్ కి చేప్పగా వాళ్ళు కూడా బయంగానే ఉన్నారు.కాని గోపాలం సిరి ల “ఒకరిని ఒకరు”వీడని బంధం గా మారిపోయారు. ఒకరోజు ఇద్దరూ కాలేజ్ లో మాట్లాడుతూ ఉండగా లెక్కల మాష్టారు చూసి విషయం తెలుసుకుని సిరి చదువు దాక ఆగమని వార్నింగ్ ఇవ్వగా దాంతో ఇద్దరూ ఒకరిని ఒకరు లెక్కల మాష్టారు చెప్పనట్టగానే నడుచుకొంటూ అలా అలా ప్రేమలోకం లో తిరుగు తూ సిరి డిగ్రీ పూర్తి చేసింది ఇంతలో గోపాలం సిరి వాళ్ళ అమ్మ నాన్న లకు బాబు ద్వార దగ్గర అయినాడు. అబ్బాయి మంచివాడు అన్నా క్రెడిట్ సంపాదించుకొన్నాడు.తను గౌవర్నమెంటు జాబ్ ఎలా తెచ్చుకొన్నడో సిరి కి కూడ అలాగే వచ్చేలా చేసాడు. మొదట గోపాలం వాళ్ళ అమ్మ గారు కొంచెం పెళ్లి కి ఆడ్డు చెప్పినా తరువాత బంధువులు మిత్రులు చెప్పిఒప్పించచారు. ఇలా గోపాలం సిరి ప్రేమ సరసమైన కథ.
ప్రస్తుతం లక్కీనగర్ లో ఇద్దరు పిల్లలతో సంతోషంగా అప్పటి కన్నా ఇప్పడే ప్రేమ గా సాగుతున్నారు ఇద్దరు పిల్లలు పుట్టినప్పడు గోపాలమే సిరి కి ఆరోగ్యం కొదుటపడే వరకు సేవలు అందంచాడు. ఇంటి పనులు అటు ఆఫీసులో పని మరలా ఇటు అమ్మ నాన కు అటు సిరి వాళ్ళ అమ్మ నాన కు చేదోడు వాదోడు గా ఇరువారి నుంచి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు అర్దం చేసుకొంటూ చిన్న చిన్న గిల్లికజాలతో చిన్న చిన్న అలకలతో ప్రేమగా ఇద్దరి పిల్లల తో సంసారసాగరం లో సరసాలతో లక్కీనగర్ స్థరపడ్డారు.

—————————————-

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!