ఆదర్శవంతమైన ప్రేమ

(అంశం:”ప్రేమ/సరసం)

ఆదర్శవంతమైన ప్రేమ

రచన: తిరుపతి కృష్ణవేణి

అమ్మా టిఫిన్ రెడినా! టైమ్అవుతుంది. ఈ రోజు మీటింగ్ ఉంది ఆఫీసుకు త్వరగా వెళ్ళాలి.
ఆ… అయింది. నాన !
టిఫిన్ టేబుల్ అన్నీ సర్థేసాను. మీ నాన్నను కూడా పిలువు టిఫిన్ పెట్టేస్తాను అన్నది అమ్మ శారద.
అమ్మ పెట్టిన టిఫిన్ త్వర త్వరగా తిని ఆఫీస్ కు బయలు దేరాడు కిరణ్.
ఆ రోజు అంతా రైతు సమస్యలు మహిళా, మరియూ డ్వాక్రా రుణాలను, మంజూరు చేసే పనిలో నిమగ్నమై ఉండటంవల్ల చాలా అలసటగా అనిపించింది. అసలే కొత్త వుద్యోగం,కొత్త వాతావరణం అవటం మూలంగా అందరిని పరిచయం చేసుకోవటం వలన చాలా సమయమైంది.
పని వత్తిడి కారణంగా అలసటగా అనిపించి ఇంటికి బయలు దేరాడు.
కొడుకు కిరణ్ ను చూసిన తండ్రి పరంధామయ్య గారు ఏరా! నాన్న! ఎలా ఉంది కొత్త ఉద్యోగం? పరిచయాలు అయ్యాయా?స్టాఫ్ అంతా మంచిగా సహకరిస్తూ వున్నారా? కొత్త కదా! రాను, రానూ అదే అర్థం అవుతోందిలే! అన్నారు. అవును! నాన్న స్టాఫ్ కూడా మంచి వాళ్ళే! ఈ రోజు రెండు మూడు సమావేశాలలో పాల్గొన్నాను. అంతా బాగానే వుంది. ఇంతలో “అమ్మ భోజనం చేసిన తరువాత మాట్లాడుకుందురు” లేవండి ! అంటూ పిలిసింది .
భోజనం తరువాత విశ్రాంతి కోసం తన రూమ్ లోకి వెళ్ళాడు. ఈ రోజు జరిగిన కార్యక్రమాలు ఒక్కసారి గా గుర్తు చేసుకున్నాడు. ఈ రోజు డ్వాక్రా గ్రూపు మీటింగులో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె ఎవరో! గానీ చూడటానికి మాత్రం బలే అందంగా ఉంది. పెద్ద పెద్ద కళ్లు , కోటేరు లాంటి ముక్కు, పెద్ద జడ,లంగా, ఓణి లో అచ్చమైన,
స్వచ్చమైన, తెలుగు దనం వుట్టీపడేలా ఉందిఆ అమ్మాయి.
ఆ అమ్మాయి వయసు కూడా 27, 28 సంవత్సరాలు వుండొచ్చు. చూడటానికి బాగా చదువు కున్న దానిలా వుంది.ఈ మీటింగ్ కు ఎందుకొచ్చిందో?
బహుశా వాళ్ళింట్లో ఎవరితరుపునైనా హాజరైందో ఏమో? ఆమె అందానికి మాత్రం కిరణ్ ముగ్దుడైనాడు. ఆ అమ్మాయి పేరేమిటో? వూరేమిటో, చిన్నగా తెలుసుకోవాలి? పెళ్ళంటూ! చేసుకుంటే! ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలి. అయినా, మాములు కుటుంబంలో ఇంత అందమైన అమ్మాయా? చాలా ఆర్చర్యంగా ఉంది?తను ఒక అధికారిననే సంగతి కూడా మరచి పోయి ఆ అమ్మాయి అంటే ఇష్టాన్నీ పెంచుకున్నాడు కిరణ్.ఆ అమ్మాయి అందం అంత ఆకర్షణీయంగా ఉంది.
శారద దంపతులకు కిరణ్ ఒక్కడే సంతానం.
చిన్ననాటినుండే మంచి క్రమ శిక్షణలో పెంచారు. కిరణ్ చాలా తెలివైన వాడు. చాలా ఉద్యోగాలకు ప్రయత్నం చేసాడు. చివరకు తనకిష్టమైన మండల అధికారి ఉద్యోగంను ఎంచుకున్నాడు. ఇతరులకు సహాయం చేయాలనే గుణం, ఆధునిక భావాలున్న యువకుడు. కొద్దిరోజుల్లోనే మండలంలో ఉన్న ప్రజలందరి మనసుకు నచ్చిన అధికారిగా మంచి పేరు తెచ్చుకున్నాడు.కిరణ్ అంటే తల్లి దండ్రులకు ప్రాణం.
చిన్ననాటినుండి నుండి నాన్న సామాజిక బాధ్యతలు, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం లాంటి ఉన్నతమైన విలువలు నేర్పిస్తూ పెంచారు. కిరణ్ ది చాలా జాలిగల హృదయం. కష్టంలో ఎవరైనా ఉంటే చూచి భరించలేడు?ఎవరు ఏ సహాయం అడిగినా కాదనలేడు. ఇంత సున్నిత మనస్సు కలవాడు ఈ ఉద్యోగం ఎలా చేస్తారో? ఏమో? అని క్రింది స్థాయి ఉద్యోగులు గుసగుస లాడుకోవటం కూడా జరిగింది.
కిరణ్ కు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటే పెళ్లి పై ధ్యాస కలుగుతూంది. చేసుకుంటే చాలా సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని కిరణ్ ఆలోచన.
తన మాటను అమ్మ నాన్నలు కాదనరని కిరణ్ నమ్మకం. సమయం చూచుకొని అమ్మతో మాట్లాడాలినుకొని ఏదో అర్జంటూ పని గుర్తుకు వచ్చి త్వరత్వరగా లేచి ఆఫీస్కి రెడీ అయ్యాడు కిరణ్.
రోజులు గడుస్తున్నాయి ఆఫీస్ పనుల్లో కిరణ్ బిజి అయ్యాడు.
ఓ రోజు వాళ్ళ మామయ్యా దగ్గర నుండి ఫోన్! వాళ్ళ అమ్మాయిని కిరణ్ కి ఇవ్వాలని ఆయన ఆలోచన.
క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు.
ఒక రోజు ఇంటికి వెళ్లిన కిరణ్ తో, అమ్మ చెప్పింది, ఒరేయ్ కన్నా! మీ మామయ్యా ఫోన్ చేశాడురా! సుజీ ని నీకు ఇచ్చి చేయాలని తొందర పడుతున్నాడు. కిరణ్ ఉద్యోగంలో స్థిర పడ్డాడు. పెళ్లి చేసేద్దాం అక్కయ్యా అని! మొదటి నుండి తెలిసిన విషయమే కదా! అయినా జాబ్ కూడా వచ్చింది ఇక పెళ్లి చేస్తే పోలా! నీ అభిప్రాయం కూడా మరో సారి కనుక్కోవాలి ఎప్పుడు మాట్లాడుకుందాము? ఏమిటీ? అని అడిగాడు నాన్న ఎమి చెప్పుదాం అడిగింది అమ్మ శారద. వాళ్ళ 9! అలాగే సృజనకి బావ కిరణ్ అంటే చాలా ఇష్టం సృజన మాత్రం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది . ఏ రోజుకారోజు మోడరన్ గా తయారు అవుతుంది. కిరణ్ కి మాత్రం చాలా సింపుల్ గా ఉండే అమ్మాయి అంటేనే చాలా ఇష్టం.
మొదటి నుండి అనుకున్న సంబంధం అయినా సుజీ అంటే కిరణ్ కు మొదటినుండి అంతగా ఇష్టం లేదు. ఎవరి ఇష్టా, ఇష్టాలు వారికి ఉంటాయి. అందుకే సుజీని పెళ్ళి చేసుకునే విషయంలో కిరణ్ అంత పెద్దగా ఎప్పుడూ ఆలోసించ లేదు.సమయం వచ్చింది ఏదో ఒకటి చెప్పేయాలి అనుకున్నాడు.
సుజీ అంటే తనకు ఇష్టం లేని విషయం అమ్మా, నాన్నలకు చెప్పాడు. ఆ మాటవిన్న శారద, బాలరామయ్యలు నొచ్చుకున్నారు.
కాని కొడుకు ను వత్తిడి చేయలేక పోయారు. మీ మామయ్య నీ మీద ఎన్నో ఆశలు
పెట్టుకున్నారు గదరా?
సరేలే ఇష్టం లేకపోతే ఎందుకు? ఏదో ఒకటి చెప్తాములే! అన్నారు.
పెళ్లి విషయంలో
నాకు మాత్రం కొంచం టైమ్ కావాలి అన్నాడు కిరణ్ అమ్మా, నాన్నలతో!…

ప్రతీ రోజూ ఏవో! ఒక సమస్యలపై రైతులకు, మహిళా సంఘాలకు అవగాహన కోసం సదస్సులు సమావేశాలు జరిగేవి. మండలంలోని అన్ని గ్రామాలపంచాయితీ కార్యాలయాలలో జరిగే సమావేశాలకు కిరణ్ హాజరువుతున్నారు. అలాంటి నేపథ్యంలో ప్రక్క వూరిలో మీటింగు కు వెళ్ళిన కిరణ్ కు అనుకోకుండా తనకు ఆ రోజు మీటింగులో కనిపించిన అమ్మాయి మరలా కనిపించడంతో కిరణ్ ఆనందం అంతా ఇంతా కాదు. అయితే ఆ అమ్మాయిది ఇదే ఊరు అని అర్థం అయింది. ఆ అమ్మాయిని పలుకరించి మాట్లాడాడు కిరణ్. ఆ అమ్మాయి పేరు రూప అని చెప్పింది.
సమావేశాలు ముగిసిన తర్వాత ఆ గ్రామ సర్పంచి గ్రామంలో అద్వాహ్నంగా ఉన్న రోడ్ల పరిస్థిని వివరిస్తూ ఎంపీడీఓ గారికి గ్రామ వీధులు చూపిస్తూన్నారు.ఒక పూరిల్లు ముందు ముద్దుగా ఉన్న చిన్న పాప నిలబడి చూస్తూనవ్వుతూ చేతులు ఊపుతూ వుంది.ముచ్చటగా ఉన్న పాపను పలుకరిస్తూ ఆ గుమ్మంలోకి నడిచారు కిరణ్.
ఇంట్లో ఉన్న దంపతులు గబగబా గుమ్మంలోకి వచ్చి ఎంపీడీఓ గార్నిమంచం వేసి కూర్చొనమని ఆహ్వానించారు.
పాపను చూచిన ఆనందంలో పాపచేయి పట్టుకొని కూర్చున్నారు.
మీ పాపా!అండి ముద్దుగా ఉంది అన్నారు. మా మనుమరాలు సార్! మా కూతురు బిడ్డ అండి అని చెప్పారు ఆ ఇంటి ఆవిడ. ఇంతలో గ్రామ సర్పంచి కల్పించు కొని సార్ వీరిది చాలా బీద కుటుంబం అండి వీళ్ళ అమ్మాయి ఇంటర్ వరకు చదివింది. ఒక్కతే అమ్మాయి, పెళ్లి చేసారు. బిడ్డ పుట్టిన తర్వాత అల్లుడు అనారోగ్యంతో మరణించాడు.
ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా చిన్న జాబ్ ఉంటే చూడండి సార్ అని ఎంపీడీఓగార్కి విన్నవించాడు సర్పంచ్ గారు. అయ్యో! మళ్ళీ పెళ్లి చేయలేక పోయారా అన్నాడు కిరణ్.
భర్త పోయిన అమ్మాయిని అంత తందరగా పెళ్లి చేసుకోవటానికి ఎవరూ ముందుకు రారండి.చూస్తున్నాము కాని ఒక్కరూ ముందుకు రావటం లేదు. పైగా భర్తను పోగొట్టుకున్న దౌర్భాగ్యురాలు అని సూటి పోటీ మాటలతో నిందలు వేస్తుంటారు. అందుకే ఎవరూ ముందుకు రావటం లేదండి,అని బాధ పడుతూ చెప్పారు.
సరే ఏదైనా అవకాశం వచ్చినపుడు చూద్దాంలే అమ్మా అంటూ వెళ్ళటానికి లేచారు. అమ్మాయి!సార్ కు నమస్కారం చేయమ్మా అని కూతురును పిలిచింది ఇంటి ఆవిడ.
రూప బయటకువస్తూ నమస్కారం చేసింది .
కిరణ్ ఒక్కసారి ఆర్చర్యపోయాడు. నేను చూస్తున్న అమ్మాయే, ఈ అమ్మాయి!
గుండె బాధతో మూలిగింది.
ఈ అమ్మాయి వెనకాల ఇంత విషాదముందా! ఈ అమ్మాయి గురించి ఎన్ని కలలు కన్నాను. ఈమె జీవితంలో ఇన్ని అవాంతరాలు ఉన్నాయా? అని ఆలోచిస్తూ గ్రామస్టుల వీడ్కోలు తీసుకొని బయలు దేరాడు ఎంపీడీఓ.కిరణ్
ఆ రోజు నుండి కిరణ్ ఆ అమ్మాయి రూప ఆలోచనలో మునిగి పోయాడు.
కిరణ్ తన జీవిత
భాగస్వామి గురించి తరచూ అనుకొనేవాడు తన మనసుకు నచ్చిన అమ్మాయి ఎవరైనా పర్వాలేదు. చదువు పెద్దగా లేక పోయినా సంస్కారం ఉంటే చాలు అలాగే ఆస్తి, పాస్తులు ముఖ్యం కాదు ప్రేమాభిమానాలు ఉంటే చాలు. బీద అమ్మాయి అయినా పర్వాలేదు. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. కానీ రూప విషాద కథను విన్న తర్వాత ఆ భావన మరింత గట్టి పడింది.
ఒక భర్తను కోల్పోయిన అమ్మాయికి మంచి జీవితాన్ని కల్పించాలని, అనాథలైన ఆ తల్లికూతుర్లకు అండగా ఉండాలని అని మనసులోనే గట్టిగా నిర్ణయించుకున్నాడు కిరణ్.
ముందుగా తన ఆలోచనను తన ఫ్రెండ్ తో చర్చించాడు.
సమాజం మనలను చిన్న చూపు చూస్తుంది. అనేక సమస్యలు ఎదురవుతాయి ఆలోచించు అని సలహా ఇచ్చాడు.
ఇవేమి నేను పట్టించుకోను అన్నాడు కిరణ్.
తర్వాత తల్లి దండ్రులతోతన ఆలోచన చెప్పాడు కిరణ్.
తల్లి ఒక్కసారి గొల్లు మన్నది. నాన్నగారు చాలా బాధ పడ్డారు. అదేంటి నాన నీకు ఏం తక్కువైంది అని అటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావు. ఈ లోకం ఏమనుకుంటుంది? మనబంధువులు ఈమంటారు? ఆలోచించావా! అని బాధతో అడిగారు. అమ్మా వారందరిగురించి నా కనవసరం. మీరు ఈమనుకుంటున్నారో చెప్పండి? మీ దీవెనలుంటే చాలు అని వారిని ప్రాధేయ పూర్వకంగా అడిగాడు కిరణ్.
వారు బాగా ఆలోచించి నీ ఇష్టమే మా ఇష్టం నాన!అని వారి ఆశీస్సులు అందించారు.
తన పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన కిరణ్ రూపావాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
కిరణ్ చెప్పిన విషయం విన్న రూపా, ఆమె తల్లిదండ్రులు ఒక ప్రక్క ఆనందం ఒక ప్రక్క ఆందోళన వ్యక్త పరిచారు. ఎంతో భవిష్యత్ ఉన్న మీరు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటమేమిటి బాబు? ఒకసారి ఆలోచించండి అన్నారు. రూపా ఈ ఆలోచన విరమించుకోండి. నాలాంటి దాన్ని చేసుకొని మీ నిండు జీవితాన్ని పాడుచేసుకోకండి అని ప్రాధేయ పడింది. ముందు నన్ను చేసుకోవటం ఇష్టమా కాదా? చెప్పు అన్నాడు కిరణ్.
అంతకంటే నాకు నా బిడ్డకు ఆనందం ఏముంటుంది సార్.
నా జీవితంలో వెలుగులు నింపుతున్న మీరు మా పాలిట దేవుడు సార్ అని సంతోషం వ్యక్తం చేసారు.
అంతే కొద్ది రోజుల అనంతరం అత్యంత సన్నిహితుల మధ్య ఎంపీడీఓ కిరణ్, రూపాను వివాహం చేసుకున్నాడు.
కిరణ్ గొప్ప మనసును కొందరు ప్రశoచించారు. కొందరు విమర్శించారు. అందరికి ఒకే రీతిలో కృతఙ్ఞతలు తెలిపాడు కిరణ్. కిరణ్ తన ఆదఆదర్షాన్ని సమాజానికి చాటి చెప్పాడు.
ఎవరిని పట్టించుకోని కిరణ్ దంపతులు తమ కుమార్తె తో హాయిగా కాలం గడుపుతున్నారు.

**

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!