ప్రకృతే మన కల్పతరువు

ప్రకృతే మన కల్పతరువు

రచయిత :: పిల్లి.హజరత్తయ్య

తన బిడ్డల లాంటి మానవులు
ఒక్కొక్కరు పిట్టల్లా రాలిపోతుంటే
జీవకోటిని కాపాడలేని నిస్సహాయ స్థితిలో
అసహాయురాలైన ప్రకృతమ్మ మౌనంగా రోదిస్తున్నది..

అభివృద్ధికై అడవులు నరికి
పచ్చనోట్లకై పంటభూములను ధ్వంసంచేసి
నేడు కాలుష్య పిశాచానికి(కరోనా) బలైపోతున్న
ప్రజల దుస్థితికి ప్రకృతి తల్లడిల్లుతోంది..

నిస్వార్ధానికి నిలువెత్తు రూపాలైన చెట్లను
మానవుల పాలిటి కల్పతరువులైన ప్రకృతిని
ప్రాణవాయు ప్రదాతలను కాపాడుంటే
మనిషిని రక్షించే దానినని వృక్షజాతి విలపిస్తున్నది..

పరోపకారమే పరమావధిగా భావించే చెట్లను
పర్యావరణ సమతుల్యతను పరిరక్షించి
ప్రకృతి విపత్తులకు చరమగీతం పాడుదాం..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!