నిప్పులాంటి నిజం

నిప్పులాంటి నిజం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

పుట్టుట గిట్టుట కోరకే
పెరుగుట విరుగుట కోరకే
ఉవ్వెత్తున ఎగసిపడిన కెరటం కూడా
విరిగిపడి తన ఉనికిని కోల్పోతుంది
మానవమాత్రులు మనం ఎంత!?
ఎందరో మహానుభావులు తమ ప్రవచనాల ద్వారా తెలియచేస్తూనే ఉన్నారు
జీవితం క్షణభంగురమని.
అయిన అంతులేని ఆశలకు లోబడిన మానవుడు
అవ్వన్నీ పెడచెవిన పెట్టి, అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోతూనే ఉన్నాడు.
ఒకసారి అత్యాశను తరిమికొట్టి చూడు.
నిజం తేటతెల్లమవ్వకపోతే అడుగు.
మానవసేవే మాధవసేవ అన్న నిజం తెలుసుకున్నవాడే…
అరిషడ్వర్గాలను జయించి, కలకాలం మానవ లోకంలో మనుగడ సాధించగలడన్న నిప్పులాంటి
నిజం కళ్ల ముందు నిలిచి, కలకాలం జీవన మాధుర్యం పంచుతుంది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!