చీకటి కావద్దు

(అంశం. :”ఆ చీకటి వెనకాల”)

చీకటి కావద్దు

రచయిత :: లోడె రాములు

నాకు చిన్నప్పటి నుండి చీకట్లో ఆరుబయట వెన్నెల్లో అమ్మ చేతి ముద్దనుండి.. స్నేహితురాల్లతో గిల్లికజ్జాల వరకూ.. ఆడే ఆటలూ.. పాటలు అంటే ఇష్టం..మా వరకు బాల్యాన్ని అమృతప్రాయంగా ఆనందించం..అమ్మానాన్నలకు ముగ్గురం ఆడపిల్లలమే.. అయినా ఏనాడూ బరువుగా తలచింది లేదు..ఉన్నంతలో గవర్నమెంట్ చదువులు..తిండికి..బట్టకు చావు లేకుండా ,భరోసా లేని వ్యవసాయాన్ని నమ్ముకొని ఆ రెండెకరాల్లోనే సాగుచేస్తు…పొద్దస్తమానం కష్టపడటం ..నేనే పెద్దదాన్ని ,డిగ్రీ మొదటి సంవత్సరం లో పట్నం నుండి సంబంధంవస్తే.. వెతుక్కుంటూ వచ్చిన సంబంధాన్ని వద్దనుకోవడం బాగుండదని.. ఇరుగుపొరుగు మాటలు..ఆడపిల్లలు ఇట్టే ఎదిగి వస్తారని హితవులు..పెళ్లి చేసే సొమ్ము..స్తోమత లేకున్నా..ఆడ పిల్ల పెళ్లికదా అని తలా ఒక చెయ్యేసి..కథ కథా అనిపించారు..
నేను నా పెళ్ళివిషయంలో నాన్నను వారించలేక పెద్దదాన్నిగా.. కుటుంబాపరిస్థితిని అర్థం చేసుకొని తలవంచాను…పట్నం వాళ్ళుకదా అన్ని పోకడలు..షోకులు..ఆర్భాటాలు..అన్ని తీర్లా నాన్నను ఉబ్బించి..గట్టెక్కారు..
మొదటి రాత్రి తో పాటు వారం రోజులు బాగానే ఉంది…అక్కడి నుండి పెళ్లి కొడుకు నిజస్వరూపం..అత్త మామల పైశాచికత్వం మెల్లమెల్లగా విశ్వరూపం దాల్చి..రోజంతా బాగానే ఉండేవారు..రాత్రయితే చాలు అదనపు కట్నం కోసం అర్ధరాత్రి చిత్రవిచిత్ర హింసలకు గురిచేస్తూ..తెల్లారితే గురివింద గింజల్లా..ఎవరి పనులకు వారు పోతుంటే…ఇక చీకటి వెనకాల నేనెమౌతానో…????

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!