చివరి మజిలీ

చివరి మజిలీ

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శ్రీదేవి విన్నకోట

అంతిమ మజిలీ చేరేలోగా
మనిషి జీవితంలో ఎన్నెన్ని వీడ్కోళ్ళో,
బంగారు గుర్తుల బాల్యానికి బై చెబుతూ
సయ్యాటల యవ్వనానికి హాయ్ చెబుతూ

అంతలోనే తీపి అనుభవాల
యవ్వనానికి టాటా పలుకుతూ,
బాధ్యతగా నడివయసు బాటలో
అలసటగా బ్రతుకీడుస్తు నడుస్తాం.

బాధ్యతల భారాలు తీరిపోయాక
నడివయసునీ బరువుగా వదిలేస్తూ
మరో బాల్యం అనే చరమ సీమలోకి
అతికష్టంగా అడుగు పెడతాం.

జీవితాన్ని పునరావలోకిస్తూ
ఆ ఇష్టం లేని వృద్ధాప్యాన్ని గడిపి
వార్ధక్యపు చివరి మజిలీకి
తుది వీడ్కోలు పలుకుతూ,
అంతులేని తెలియని తీరాలకు
గుడ్ బై చెబుతూ ఎక్కడికో అలాపయనమయి మాయమౌవుతాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!