నా సఖి

నా సఖి

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పసుమర్తి నాగేశ్వరరావు

నా హృది మదిలో
నా మది ఎదలో
నా అనుమతి లేకుండా చేరువై
నాకు చెప్పకుండా దూరమైన నా సఖి

నిండుజాబిలి పండువెన్నెలలో
సాయంసంధ్య హరివిల్లులలో
రంగుల సుమ వనంలో
నీ జ్ఞాపకాలే నను వెంటాడుతూ

సెలెయేటి పరవళ్లు లో
పచ్చని పైరు పంటల్లో
అందమైన కొండ కోనల్లో
నీ నవ్వులు ముత్యాల రవ్వలై వినిపిస్తున్నాయి

కలయో నిజమో తెలిసే లోగా
అవునో కాదో గ్రహించే లోగా
తీరని దూరాలకు
చేరని తీరాలకు చేరుకున్నావు

ఏది ఎలా వున్నా
ఏది ఏమైనా
నువు బాగుండాలి
నీకు మంచి జరగాలి
ఇవే నా కన్నీటి వీడ్కోలు

You May Also Like

One thought on “నా సఖి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!